సీఎం కేసీఆర్‌పై  మ‌రొక‌సారి నిప్పులు చెరిగారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వానా కాలం తరహాలోనే.. యాసంగిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని  హెచ్చరించారు  సంజయ్‌. యాసంగిలో ధాన్యం కొనకపోతే.. అంతుచూస్తామని వార్నింగ్ కూడా ఇచ్చారు. మెడ మీద కత్తి పెడితే… ఫామ్‌ హౌజ్‌ రాసిస్తావా అని  బండి సంజయ్ చురకలు అంటించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతుల ప్రయోజనాల కోసం మర్యాదగా మాట్లాడితే….సీఎం కేసీఆర్ కు మాత్రం మైండ్ దొబ్బిందని ఫైర‌య్యారు.  నాలుకకు, మెదడుకు ఉన్న నరం కట్ అయిందని కేసీఆర్‌ పై  బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు నిప్పులు చెరిగారు.

తెలంగాణ‌లో బాయిల్డ్ రైస్ కాకుండా 5 ర‌కాల విత్త‌నాలు వేయాల‌ని.. ఇత‌ర రాష్ట్రాలు అవే విత్త‌నాలు వాడుతున్నార‌ని గుర్తు చేసారు. తెలంగాణ‌లో ఆ విత్త‌నాల‌ను ఎందుకు వాడ‌డం లేద‌ని.. ఇత‌ర రాష్ట్రాల‌కు లేని స‌మస్య తెలంగాణ‌కు ఎందుకు వ‌స్తున్న‌ద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసారి బండి సంజ‌య్‌.  కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా యాసిడ్ టెస్ట్ పెట్టింద‌ని,  యాసిడ్  టెస్ట్ చేస్తే పాత బియ్య‌మా.. కొత్త బియ్య‌మా అని తెలిసిపోతుంద‌ని పేర్కొన్నారు. గ‌తంలో బియ్య‌మును తీసుకొచ్చి గోదాముల్లో ఫుల్‌గా నింపార‌ని.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కొత్త నాట‌కానికి తెర‌లేపాడ‌ని ఇది ఫ్యాక్ట్ అని బండి సంజ‌య్ పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: