సీఎం కేసీఆర్‌కు రోశ‌య్య కుటుంబ సభ్యులు అంత్య‌క్రియ‌లు మ‌హాప్ర‌స్థానం వ‌ద్ద వ‌ద్దు అని.. ఫాంహౌస్‌లోనే నిర్వ‌హిస్తాం అని చెప్పారు. అందుకు సీఎం కేసీఆర్ కూడా  మీకు న‌చ్చిన వ‌ద్ద నిర్వ‌హించుకోండి.. ప్ర‌భుత్వం త‌రుపున మేము అన్ని విధాలుగా ఏర్పాట్లను చేప‌డుతాం అని చెప్పారు కేసీఆర్‌. ఇవాళ సీఎం కేసీఆర్ రోశ‌య్య పార్థివ‌దేహానికి నివాళుల‌ర్పించిన అనంత‌రం ఆయ‌న కుటుబ స‌భ్య‌ల‌తో కొద్ది సేపు మాట్లాడి వివ‌రాల‌ను తెలుసుకున్నారు సీఎం.

ముఖ్యంగా అంత్య‌క్రియ‌ల గురించి కుటుంబ స‌భ్యులు సీఎంకు వివ‌రించారు. అదేవిధంగా సీఎం 4, 5, 6 తేదీల‌లో ప్ర‌భుత్వం త‌రుపున సంతాపం దినాలుగా ప్ర‌క‌టించారు. అదేవిధంగా రేపు మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు గాంధీ భ‌వ‌న్ నుంచి అంతిమ యాత్ర కొన‌సాగి కొంప‌ల్లిలో ఉన్న రోశ‌య్య ఫాంహౌస్‌లో అంత్య‌క్రియ‌లు ప్ర‌భుత్వ లాంఛ‌నంగా నిర్వ‌హించ‌నున్నారు. ప‌లువురు నేత‌లు రోశ‌య్య మృత‌దేహాన్ని ప‌రామ‌ర్శించి జోహార్లు రోశ‌య్య జోహార్లు అంటూ నినాదాలు చేసారు.


మరింత సమాచారం తెలుసుకోండి: