మెరుగైన పీఆర్సీ కోసం ఉద్యోగుస్తులు పోరాడుతున్న సంగతి తెలిసిందే.. రాష్ట్రవ్యాప్తంగా పీఆర్సీ సాధన సమితి ఆందోళనలు జరుగుతున్నాయి. ఇవాళ ప్రభుత్వ యాప్‌లు నిలిపివేయాలని  ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. వేతన స్లిప్పులు, పీఆర్సీ జీవోల దహనానికి ఉద్యోగ సంఘాల పిలుపు ఇచ్చాయి. నిరసనలో భాగంగా రేపు 'చలో విజయవాడ' కార్యక్రమం చేపట్టారు.

అయితే.. రేపటి 'చలో విజయవాడ' కార్యక్రమానికి పోలీసుల ఆంక్షలు పెడుతున్నారు. 'చలో విజయవాడ'కు పోలీసులు అనుమతి నిరాకరించారు. చలో విజయవాడకు బయల్దేరుతున్న ఉద్యోగులను అడ్డుకుంటున్నారు. వివిధ జిల్లాల్లోని ఉద్యోగ సంఘాల నేతలను గృహనిర్బంధం చేస్తున్నారు. చలో విజయవాడకు ఉద్యోగులు రావద్దని పోలీసులు చెబుతున్నారు. విజయవాడ వెళ్లవద్దని నోటీసులు జారీచేశారు. అంతేకాదు.. ఉద్యోగ సంఘాల నాయకుల ఇళ్ల చిరునామాలు సేకరిస్తున్నారు. విజయవాడకు వచ్చేవారి వివరాలు సేకరించాలని వాలంటీర్లకు ఇప్పటికే  సమాచారం ఇచ్చారు. ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: