ముచ్చింతల్‌లోని సమతామూర్తి కేంద్రంలో రామానుజ సహస్రాబ్ది నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.. ఇక్కడ ఈనెల 14 వరకూ రోజూ కార్యక్రమాలు ఉంటాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. సహస్రాబ్ది వేడుకల్లో ప్రతి రోజు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రతి రోజు ఉ.6.30 నుంచి రాత్రి 9.30 వరకు కార్యక్రమాలు ఉంటాయి. ఇవాళ 9 గంటలకు శోభయాత్ర మొదలైంది. 10 గం.కు వాస్తుశాంతి, రుత్విక వరణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఇక సాయంత్రం 5 గంటలకు సహస్రాబ్ది ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. నేటి నుంచి ఉత్సవాల్లో అత్యంత కీలకమైన హోమాలు ప్రారంభం అవుతాయి. ప్రతి రోజు సా.5 గంటల నుంచి అరగంట పాటు విష్టు సహస్రపారాయణం ఉంటుంది. ప్రతి రోజు సా.5.30 నుంచి 7.30 వరకు ముఖ్యఅతిథుల ప్రసంగాలు ఉంటాయి. ప్రతి రోజు రాత్రి 9.30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఇవాళ మధ్యాహ్నం 12.30 నుంచి ఒంటిగంట వరకు పూర్ణాహుతి, ప్రసాద వితరణ ఉంటుంది. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 4.30 వరకు విరామం ఉంటుంది. సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకు యాగశాలలో హోమం చేస్తారు. రాత్రి 7.30నుంచి 8 వరకు రామానుజుల లైవ్ లేజర్ షో ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: