రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇండియాకు లాభం చేకూరుస్తోందా.. అంటే ఒక విధంగా అవుననే చెప్పాలి.. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా నుంచి నుంచి భారత్ భారీగా చమురు కొంటున్న సంగతి తెలిసిందే. రష్యా నుంచి  చమురు కొనుగోళ్లను యూరప్ దేశాలు నిలిపేసిన సమయంలో ఇండియా, చైనా మాత్రమే రష్యా నుంచి చమురు కొంటున్నాయి.  యుద్ధం మొదటి 3నెలల్లోనే 2 దేశాలు ఇండియా, చైనా కలిపి 24 బిలియన్  డాలర్ల విలువైన రష్యా చమురును దిగుమతి చేసుకున్నట్టు తెలుస్తోంది.


ఓవైపు అమెరికా, యూరప్‌ యూనియన్ వార్నింగ్ ఇస్తున్నా.. భారత్, చైనా లెక్క చేయడం లేదు. మేతో ముగిసిన 3నెలలకు చైనా 18.9 బిలియన్  డాలర్లు విలువైన చమురు కొన్నది. ఇండియా  5.1 బిలియన్  డాలర్ల విలువైన రష్యా చమురు కొన్నది. గతేడాదితో పోలిస్తే ఇది 5 రెట్లు ఎక్కువ. రష్యా కూడా ఇండియా, చైనాలతో ఉన్న అనుబంధం దృష్టిలో ఉంచుకుని భారీ తగ్గింపు ఆఫర్లు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: