ప్రముఖ గాయకుడు దలేర్‌ మెహందీకి కోర్టు జైలు శిక్ష విధించింది. దలేర్ మెహందీకి పటియాలా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఎందుకంటే.. 2003లో మానవ అక్రమ రవాణా కింద నమోదైన కేసులో కోర్టు ఈ శిక్ష  విధించింది. అనేక దలేర్ మెహందీ పాటలు పాడేందుకు వెళ్లేవాడు కదా.. ఆ దేశాల్లో పాటలు పాడటానికి వెళ్లినపుడు తన వెంట కొంతమందిని తీసుకెళ్లేవాడు.. అప్పుడు తాత్కాలిక వీసాలతో తీసుకెళ్లి అక్కడే వదిలేసినట్లు దలేర్‌పై అనేక ఆరోపణలున్నాయి.


విదేశాల్లో స్థిరపడాలనుకునే వారి నుంచి దలేర్‌ మెహందీ డబ్బులు తీసుకునేవాడని పోలీసులు ఆరోపణలు ఫ్రేమ్ చేశారు. అంతే కాదు.. పోలీసులు.. వాటిని సాక్ష్యాలతో సహా రుజువు చేశారు. అందుకే కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.  కోర్టు తీర్పు నేపథ్యంలో దలేర్‌ను పంజాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పంజాబీ పాప్ సింగర్‌గా పేరుగాంచిన దలేర్‌ మెహందీకి మంచి ఫాలోయింగ్ ఉంది. దలేర్‌ బాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ అనేక సూపర్‌ హిట్ చిత్రాల్లో  పాటలు పాడాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: