అక్కడ పులి రోడ్డు దాటేందుకు ఇబ్బంది పడుతోంది. వచ్చి పోయే వాహనాలు దాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే.. పులి రోడ్డు దాటేందుకు అధికారులు కొద్దిసేపు ట్రాఫిక్ నిలిపివేశారు. ఈ అరుదైన సంఘటన మహారాష్ట్రలో జరిగింది. మహారాష్ట్రలోని చంద్రపూర్‌లోని నాగ్‌భీడ్‌-బ్రహ్మపురీ రహదారిపై ఈ ఘటన జరిగింది.


నాగ్‌భీడ్‌-బ్రహ్మపురీ రహదారిపై అక్క రద్దీ కారణంగా పులి రోడ్డు దాటలేకపోయింది. ముందుకు  వెళ్లేందుకు చాలా సేపు  యత్నించింది. కుదరక పోవడంతో పులి రోడ్డు పక్కన కూర్చుండిపోయింది. దీన్ని గమనించిన వాహన దారులు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఆ సమాచారంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు కొద్దిసేపు ట్రాఫిక్‌ను నియంత్రించారు. ఆ దారిలో ట్రాఫిక్ నిలిపివేశారు. అది గమనించిన పులి మెల్లగా రోడ్డు దాటి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలను కొందరు స్థానికులు వీడియో తీశారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: