వైసీపీ సర్కారు తీరుపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. వైసీపీ అసమర్థ ప్రభుత్వంలో దిల్లీలో అప్పు దొరికితేనే ఏపీలో జీతాలని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వంలో నెలలో మొదటి తారీఖున ఉద్యోగుల ఖాతాలలో ఖచ్చితంగా జీతాలు పడేవని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు.  బుగ్గన ఇక్కడ కన్నా దిల్లీలో ఉండేదే ఎక్కువన్న అచ్చెన్నాయుడు ఏపీలో ఆర్థిక శాఖా మంత్రి అనే పదవి లేదని విమర్శించారు.


ఏపీలో ఇప్పుడున్నది కేవలం అప్పుల శాఖా మంత్రి మాత్రమేనని అచ్చెన్నాయుడు ఎద్దేవాచేశారు. 5 వ తేదీ వచ్చినా ఇంకా సగం మంది ఉద్యోగులు జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఏపీ రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లేదని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. గత ప్రభుత్వంలో అభివృద్ది కోసం కొద్దిగా అప్పు చేసినా నానా యాగీ చేసిన ఇదే ఆర్థిక మంత్రి ఇప్పుడు నిస్సిగ్గుగా జగన్ చేయిస్తున్న లక్షల కోట్ల అప్పులను సమర్థిస్తున్నాడని అచ్చెన్నాయుడు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: