ఏపీ హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి ఊరట లభించింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించటం లేదని ఛీఫ్ సెక్రటరీపై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది . ఈ దశలో కోర్టు ధిక్కరణకు పాల్పడినట్లు తేల్చలేమని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ పిటీషన్ ను కొట్టేస్తూ ఉత్తర్వులు జారీచేసింది . నిఘా పరికరాల కొనుగోలు విషయంలో అవతవకలు జరిగాయంటూ గతంలో ప్రభుత్వం ఏబి వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది.


దీనిపై ఏబీవీ  హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేశారు . పిటీషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం ఆయన పై ఉన్న సస్పెన్షన్ ను ఎత్తివేస్తూ .. ఏబి వెంకటేశ్వరరావుకు రావాల్సిన వేతనం చెల్లించాలని ఆదేశాలిచ్చింది. అయితే..  ఏప్రిల్ 22 నుంచే పూర్తిస్థాయి జీతభత్యాలు చెల్లిస్తున్నారు కాని .. హైకోర్టు ఆదేశాల ప్రకారం సస్పెన్షన్ కాలానికి తనకు రావాల్సిన జీతభత్యాలు ఇవ్వాలని ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం దాఖలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: