తెలంగాణలో ఉద్యోగాల వెల్లువ మొదలైంది. తాజాగా వైద్య, ఆరోగ్యశాఖలో 1147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ మేరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. వైద్యవిద్యాశాఖ సంచాలకుల పరిధిలో మొత్తం 34 విభాగాల్లో ఈ పోస్టులు నియమిస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.


ఇందుకోసం అర్హులైన వారు ఆన్ లైన్లో ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల ఐదో వరకు దరఖాస్తు చేసుకోవాలని మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు తెలిపింది. వైద్య, ఆరోగ్యశాఖలో ఉద్యోగాల వర్షం కురుస్తోందని మంత్రి హరీష్ రావు సోషల్ మీడియా ద్వారా స్పందించారు. తెలంగాణలో ఇప్పటికే గ్రూప్ 1, పోలీస్‌ ఉద్యోగాల ప్రక్రియ నడుస్తోంది. ఇటీవలే 9 వేలకుపైగా ఉద్యోగాలతో గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ ఇవ్వబోతున్నామని టీఎస్‌పీఎస్సీ కూడా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: