ఏపీలో దళితులకు జగన్ సర్కారు భారీగా ఆదుకుందని ఆ వర్గం నేతలు చెబుతున్నారు. జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంలో ఈ నాలుగేళ్ల కాలంలో 1.7 కోట్లు కుటుంబాలకు వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.53,919 కోట్లు లబ్ధి చేకూరిందని జూపూడి ప్రభాకర్ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితులకు ఏపీ లో ఎక్కవ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని జూపూడి ప్రభాకర్ చెప్పారు. వైయ‌స్ఆర్ సిపికి మొదటి నుంచీ దళితులు కుడి భుజంగా నిలుస్తున్నారని జూపూడి ప్రభాకర్ చెప్పారు.


దళితులు అందరూ ఐక్యంగా ఉండి మళ్ళీ మళ్లీ జగన్ గారిని ముఖ్యమంత్రి చేయటమే లక్ష్యంగా పని చేయాలని జూపూడి ప్రభాకర్ కోరారు. వైయ‌స్ఆర్ సిపి ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికోట్టాలని జూపూడి ప్రభాకర్  పిలుపునిచ్చారు. రాష్ట్ర స్థాయి ఎస్సీ మహాసభ ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయ్యాలి అన్నదాని పై నేతలు చర్చించారు. మెజారిటీ నాయకులు విజయవాడలో ఏర్పాటు చెయాలని కోరారని జూపూడి ప్రభాకర్  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: