2019లో ఓడిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ కొన్నాళ్లకు మళ్లీ బీజేపీతో కలిశాడని.. ఇప్పుడు సంసారమేమో బీజేపీతో సహజీవనమేమో తెలుగుదేశం పార్టీతో చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఇది పవన్‌కళ్యాణ్‌ తాలూకా రాజకీయ వ్యక్తిత్వమని చెప్పుకోవాలా అని ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ 15 ఏళ్ల కిందట రాజకీయాల్లోకొచ్చాడని... చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా రాజకీయ అరగేట్రం చేశాడని గుర్తు చేస్తున్న వైసీపీ మేతలు.. ఆ తర్వాత జనసేన పార్టీ పెట్టి పదేళ్లలో ఏం సాధించారని ప్రశ్నిస్తున్నారు.


అసలు పవన్ కల్యాణ్‌కు ఒక విధానం, సిద్ధాంతం, లక్ష్యం, స్థిరత్వం లేదవి.. ఒకపక్క విప్లవవాదినంటూనే మరోపక్క బీజేపీతో కలిసి పనిచేస్తున్నానంటారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. 2014 నుంచి 2023 వరకు గడచిన 9 ఏళ్లుగా దాదాపు ఆరేడు పార్టీలతో పవన్‌ పొత్తులు పెట్టుకున్నారని.. వాటిల్లో ఒక పార్టీకి మరో పార్టీకి విధానాలు కలవవని అన్నారు.  లక్ష్యాలు, సిద్ధాంతాలు వేరుగా ఉన్న పార్టీలతో కలిసి పవన్‌ ఎలా పనిచేస్తారని.. 2014లో తెలుగుదేశం, బీజేపీతో పొత్తు పెట్టుకున్న పవన్‌ అదే ఏడాది ఎన్నికలు వచ్చేసరికి సీపీఐ, సీపీఎం, బీఎస్పీలతో పొత్తు పెట్టుకున్నారని గుర్తు చేశారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: