గృహసారథులు, జగనన్న సచివాలయ కన్వీనర్లు కలసి నిర్వహించిన జగనన్నే మా భవిష్యత్తు, జగనన్న సురక్ష వంటి కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో జగన్ గ్రాఫ్‌ పెంచాయని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇవి పూర్తిస్థాయిలో విజయవంతం అయ్యాయని ఇటీవల సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పారు. ప్రతి ఇంటికి వైయస్ జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరగకుండా వారికి కావాల్సిన సేవలు ఇంటివద్దకే అందించేలా జగనన్నే మా భవిష్యత్తు, సురక్ష కార్యక్రమాలను ఇటీవల వైసీపీ నిర్వహించింది.


దీని ద్వారా జనన,మరణాల సర్టిఫికెట్లు, రెవెన్యూ సిబ్బంది జారీ చేసే సర్టిఫికెట్ల వంటివి ప్రజల ఇళ్ల ముందుకే వచ్చేశాయి. అధికార పార్టీ ప్రజల అవసరాలు తీర్చడంలో ఇలాంటి కార్యక్రమం ఎంతగానో దోహదం చేస్తుంది. ఈ కార్యక్రమాల పట్ల పార్టీ కార్యకర్తలే కాదు.. సామాన్య ప్రజలనుంచి సానుకూల స్పందన వచ్చింది.


మరింత సమాచారం తెలుసుకోండి: