అమెరికా పర్యటనలో భాగంగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి.. మూడవ రోజు వాషింగ్టన్ డీసీలోని యూఎస్ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్ అగ్రికల్చర్ - ఎన్‌ఐఎఫ్‌ఏ సందర్శించారు. ఎన్‌ఐఎఫ్‌ఏ డైరెక్టర్ డాక్టర్ మంజిత్ మిశ్రాతో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఐటీ, ఫార్మ్ ఎకనామిక్స్, సీడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ మ్యానేజ్మెంట్, మార్కెటింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, న్యుయర్ ప్లాంటింగ్ టెక్ తదితర రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలపై యూఎస్‌డీఏ ప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బృందం విస్తృతంగా చర్చించింది.


పరిశోధన రంగంలో యూఎస్‌డీఏ సహకారం ఆశిస్తున్నామని... తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికత అందిపుచ్చుకోవాలన్నదే మా ఆకాంక్ష అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. భావితరాలు వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేలా చూసుకునే బాధ్యత మనపై ఉందని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఏ దేశంలో అయినా వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన చాలా ముఖ్యం అని ఎన్‌ఐఎఫ్‌ఏ డైరెక్టర్ మంజిల్ మిశ్రా అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

USA