ఎన్నికలు జరుగుతున్న తెలంగాణలో కర్నాటక ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం వివాదానికి దారి తీస్తోంది. అలా ఎలా ఇస్తారని భారతీయ జనతా పార్టీ ప్రశ్నించింది. ఇదే అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత ప్రకాష్ జవదేకర్, ఇతర నేతలు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ను కలిశారు. కర్నాటక ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనలపై ఆయనకు ఫిర్యాదు చేశారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రంలో మరో రాష్ట్రం ఇలా ప్రకటనలు ఇవ్వడం సబబు కాదన్నారు.


ఇలాంటి  ప్రకటనలు పార్టీలు ఇవ్వవచ్చని.. కర్నాటక ప్రజల డబ్బుతో తెలంగాణలో ప్రకటనలు ఎలా ఇస్తారని బీజేపీ నేతలు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడం లేదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. కర్నాటక ప్రజల డబ్బుతో తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. మరి ఈ ఫిర్యాదుపై ఈసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: