సీఎం చంద్రబాబు పోలవరంపై ఫోకస్‌ పెట్టారు. సచివాలయంలో జలవనరుల శాఖ అధికారులతో  భేటీ అయిన సీఎం చంద్రబాబు.. పోలవరం సహా వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించే అవకాశం ఉంది. పోలవరం సహా అనేక అంశాలపై శ్వేత పత్రాల విడుదల చేసేందుకు సిద్దమవుతోన్న చంద్రబాబు.. గత పాలనకు ఇప్పటికీ భిన్నత్వాన్ని చూపించాలని భావిస్తున్నారు.


ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు సచివలయంలోనే ఉండాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సమయపాలన కచ్చితంగా పాటించాలని నిర్ణయించుకున్న సీఎం చంద్రబాబు.. జిల్లాల్లో, నియోజకవర్గాల్లో కొత్త మంత్రుల పర్యటన పూర్తయ్యాక తొలి కెబినెట్ భేటీ నిర్వహించే అవకాశం ఉంది. పోలవరం పర్యటన పూర్తయ్యాక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని యోచిస్తున్న ప్రభుత్వం.. నిరంతరం సచివాలయానికి రావాలని తనను కలిసిన మంత్రులకు సూచించారు. తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని పరిపాలన పరంగా పూర్తి స్థాయి అవగాహన పెంచుకోవాలని మంత్రులకు సీఎం చంద్రబాబు దిశా నిర్దేశం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: