చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ ఫోన్ తయారీ కంపెనీ షావోమి కస్టమర్లకు శుభవార్త తెలియచేయడం జరిగింది. షావోమి నుంచి ఎంఐ క్రెడిట్ ప్లాట్‌పామ్‌ను మళ్లీ లాంచ్ చేసేందుకు సిద్ధం అవుతుంది. భారత్‌లో డిసెంబర్ 3న కంపెనీ మళ్లీ ఎంఐ క్రెడిట్ ప్లాట్‌పామ్‌ను అధికారికంగా ఆవిష్కరణ మహోత్సవం నిర్వహించబడుతుంది. దీని ద్వారా కస్టమర్లకు పర్సనల్ లోన్స్ సులువుగా పొందే అవకాశం ఉంది. 

 

 

 గత సంవత్సరం షావోమి  మే నెలలోనే ఎంఐ క్రెడిట్ ప్లాట్‌ఫామ్‌ను గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు కంపెనీ కొత్త వెర్షన్‌ను  ప్రజల ముందుకు తీసుకొని రాబోతుంది. కానీ ఇప్పటిదాకా కొత్త వెర్షన్ గురించి  ఎలాంటి సమాచారం ఇవ్వ లేదు. అయితే కంపెనీ గత నెలలో గూగుల్ ప్లేస్టోర్‌లో కొత్త ఎంఐ క్రెడిట్ యాప్‌ను అప్‌‌లోడ్ చేయడం జరిగింది. దీని ప్రాతిపదిన చూస్తే పలు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నట్లు సమాచారం ఉంది.

 

 

ఇప్పటికే షావోమి  కంపెనీ  ఎంఐ క్రెడిట్ ప్లాట్‌ఫామ్ లాంచ్‌కు సంబంధించి ఆహ్వాన పత్రికలను కూడా పంపించడం జరిగింది. షావోమి ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా యూజర్లకు తక్షణ రుణ సదుపాయం ఇవ్వబోతుంది అని బాగా తెలుస్తుంది. గతంలో కంపెనీ క్రెడిట్ బీ  అనే సంస్థతో జతకట్టిన సంగతి తెలిసిందే కదా. ఇది  క్రెడిట్ బీ  కంపెనీ  బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ.

 

షావోమి కంపెనీకి  ఇండియాలో బాగా మంచి పేరు రూపుదిడుకొవడం జరిగింది. ఇక పర్సనల్ లోన్ నిమిషాలలో సులువుగా పొందవచ్చు. ఇక షావోమి  అభిమానులు మంచి శుభవార్త అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: