ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రస్తుత దేశ మార్కెట్ ను కూడా దెబ్బ తీస్తుంది.. ఇప్పటికే చైనా మార్కెట్ ను నేల నాకించిన ఈ కరోనా వైరస్ ఇప్పుడు మన దేశంపై పడి ఏడుస్తుంది. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. దేశీ స్టాక్ మార్కెట్‌కు లాభాలు ఒక్క రోజు ముచ్చటగానే నిలిచిపోయాయి. 

 

వారం రోజుల తర్వాత నిన్న లాభపడిన బెంచ్‌మార్క్ సూచీలు ఈరోజు మళ్లీ నష్టపోయాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు భారీగా పెరుగుతుండటంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. దీంతో సూచీలు దారుణంగా పడిపోయాయి. దీంతో సెన్సెక్స్ 214 పాయింట్ల నష్టంతో 38,409 పాయింట్ల వద్ద ముగిసింది. 

 

ఇక నిఫ్టీ 52 పాయింట్లు నష్టంతో 11,251 పాయింట్ల వద్ద ముగిసిపోయింది. బ్యాంక్, ఫైనాన్షియల్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి భారీగా కనిపించింది. కాగా నిఫ్టీ 50లో సిప్లా, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సన్ ఫార్మా, పవర్ గ్రిడ్, గెయిల్ షేర్లు బాగా లాభపడ్డాయి. సిప్లా 5 శాతం పెరుగుదల కనిపించింది. 

 

అదేసమయంలో నిఫ్టీ 50లో యస్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, టాటా మోటార్స్ భారీగా నష్టపోయాయి.. ఇక నిఫ్టీ మీడియా ఇండెక్స్ 2 శాతానికి పైగా పడిపోయింది. కాగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి దాదాపు ఫ్లాట్‌గానే ట్రేడ్ అయ్యింది. 73.30 వద్ద కదలాడింది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ముడి చమురు ధరలు పెరిగాయి. మరి రేపు పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభావం ఏలా ఉంటుందో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: