గత కొన్ని రోజుల నుంచి కరోనా మహమ్మారి కారణంగా స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాల్లో ముగుస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు మాత్రం స్టాక్ మార్కెట్లు భారీ స్థాయిలో లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు పుంజుకోవడంతో పాటు ఈరోజు కేంద్రం ఆర్థిక ప్యాకేజీని ప్రకటించవచ్చని వార్తలు రావడంతో స్టాక్ మార్కెట్లు భారీగా లాభపడ్డాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఒక దశలో 1286 పాయింట్లు పుంజుకుంది. 
 
కానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ప్యాకేజ్ ను ప్రకటించడానికి కొంతమేర సమయం పడుతుందని చెప్పడంతో లాభాలు ఆవిరయ్యాయి. ఈరోజు అన్ని రంగాలలోని షేర్ల అమ్మకాలు బ్లాక్ మండే విషాదాన్ని మరపించేలా పుంజుకున్నాయి. అన్ని రంగాల షేర్లు లాభపడినా విమాన రంగ షేర్లు మాత్రం నష్టపోవడం గమనార్హం. కేంద్రం దేశీయ విమాన సర్వీసులను రద్దు చేయడంతో షేర్లు నష్టపోయాయి. 
 
ఈరోజు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 692 పాయింట్ల లాభంతో 26,674 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 190 పాయింట్లు పెరిగి 7801 పాయింట్ల వద్ద ముగిసింది. ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ రంగాల షేర్లు లాభాలతో ముగిశాయి. విశ్లేషకులు స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ముగియడంతో మార్కెట్ రీబౌండ్ అయిందని అభిప్రాయపడుతున్నారు. ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. చమురు ధరలు పెరగడంతో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకునే అవకాశం ఉందని మదుపరులు ఆశిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: