దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉంది. కోవిడ్ దెబ్బతో అన్నివర్గాలు, రంగాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సమయంలో పలు ఆటో మొబైల్ సంస్థలు తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించాయి. వ్యారంటీ, సర్వీసింగ్ పీరియడ్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో ముఖ్యం గా మహీంద్రా అండ్ మహీంద్రా, ఆడి, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, హోండా మోటార్స్ సైకిల్స్ గడువు ను పెంచాయి. ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి..


వివరాల్లొకి వెళితే..


టాటా మోటార్స్…


దేశీయ ఆటో దిగ్గజం టాటా మోటార్స్ జర్మన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడీ భారత్‌లోని తమ కస్టమర్ల వారంటీ, సర్వీస్ ప్లాన్స్‌ ను జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్, మే నెలల్లో వారంటీ లేదా సర్వీసింగ్ ప్లాన్స్ ముగిసే కార్లకు ఈ పొడిగింపు అందుబాటులో ఉంటుంది. టాటా మోటార్స్ తమ కమర్షియల్ వెహికిల్స్ కస్టమర్ల వారంటీ, ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్‌ను జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.


బజాజ్ ఆటో మొబైల్స్…


బజాజ్ ఆటో మొబైల్స్ బజాజ్ ఆటో మొబైల్స్ తమ అన్ని బ్రాండ్స్ వాహనాలకు జూలై చివరి వరకు ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్‌ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీ నుండి మే 31వ తేదీ వరకు ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్ ముగిసే వాహనాలకు వర్తిస్తుంది. హోండా మోటార్స్ తన అన్ని మోడల్ బైక్స్, స్కూటర్ల వారంటీ, ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్‌ ను జూలై నెలాఖ రు వరకు పొడిగించింది.. ఏప్రిల్ 1 నుంచి మే 31వరకు గడువు వున్న వాళ్ళకు ఇది వర్తిస్తుంది..


మహీంద్రా.. 


దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ వ్యారంటీ, సర్వీసింగ్ పీరియడ్‌ ను జూలై 31వ తేదీ వరకు పొడిగిస్తూ ప్రకటించాయి.. ఇది నిజంగా నే అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: