దేశీయ బ్యాంక్ ఆర్‌బీఐ ప్రస్తుతం కొత్త చట్టాలను అమలు చేస్తుంది. డబ్బులను తీసుకోవడం లో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. కొద్దీ రోజుల క్రితం రుణాల పై వడ్డీల ను పెంచింది. డబ్బులను డ్రా చేసుకోవడంలో కూడా కొత్త పద్దతులను అమల్లోకి తీసుకొచ్చింది. తాజాగా మరోసారి బ్యాంక్ లకు భారీ షాక్ ఇచ్చింది. ఏటీఎం లావాదేవీలకు సంబంధించి బ్యాంకులు అధిక ఇంటర్‌ఛేంజ్ ఫీజును వసూలు చేయడానికి అనుమతి ఇచ్చింది..

బ్యాంక్ కస్టమర్లపై మరీముఖ్యంగా ఏటీఎం లావాదేవీలు నిర్వహించే వారి పై ప్రతికూల ప్రభావాల ను చూపిస్తుంది. ఆర్‌బీఐ ఏటీఎం ఇంటర్‌ఛేంజ్ చార్జీల ను పెంచుకోవచ్చని బ్యాంకుల కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బ్యాంకులు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌ పై రూ.17 వరకు చార్జీ వసూలు  చేసేందుకు అన్ని రకాల అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తుంది. గతంలో ఈ చార్జీలు 15 రూపాయలు ఉండగా, ఇప్పుడు ఈ చార్జీలు రెండు రూపాయలు పెంచారు.


అంతేకాదు నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఈ చార్జీని రూ.5 నుంచి రూ.6కు పెంచింది.ఏటీఎం ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే.. అప్పుడు బ్యాంకులు గరిష్టంగా ఒక్కో ట్రాన్సాక్షన్‌కు రూ.21 వరకు వసూలు చేయొచ్చు. ఈ చార్జీ ప్రస్తుతం రూ.20 గా ఉంది. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల ఫీజు పెంపు నిర్ణయం 2022 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది.. మిగిలిన రూల్స్ అనేవి ఆగస్టు 1 నుంచి వర్తించబడతాయి. ఆ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒక బ్యాంక్ ఏటీఎం నుంచి మరో బ్యాంక్ లో డబ్బులను తీసుకుంటే చార్జీలు పడతాయని ఆర్బీఐ ప్రకటించింది. ఇది నిజంగానే బ్యాంక్ కస్టమర్ల కు షాక్ ఇచ్చే న్యూస్ అనే చెప్పాలి. బ్యాంకులు గరిష్టంగా ఒక్కో ట్రాన్సాక్షన్‌ కు రూ.21 వరకు వసూలు చేసుకోవచ్చునని తెలిపింది. జూలై లోపుఈ నిర్ణయం మారుతుందో.. లేదా అదే ఫిక్స్ చేస్తుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: