ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత మనిషి పిరికివాడిగా మారిపోతున్నాడేమో అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది అని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ధైర్యంగా నిలబడి ఎదుర్కొనే వాడు మనిషి. కానీ ఇటీవల కాలంలో మాత్రం చిన్న చిన్న సమస్యలకే కృంగిపోతూ జీవితం అక్కడితో ముగిసిపోయిందని బాధపడుతూ చివరికి క్షణికావేశంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దేవుడు ఇచ్చిన విలువైన ప్రాణాన్ని మనిషి చేజేతులారా తీసుకుంటున్నాడు అని చెప్పాలి. తలుచుకుంటే తీరిపోయే సమస్యలకు సైతం మనిషి కృంగిపోతూ ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు నేటి రోజుల్లో కోకోల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి.


 ఇలాంటి తరహా ఘటనలు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు  ఇక్కడ కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అతనికి ఏం కష్టం వచ్చిందో తెలియదు కానీ ఏకంగా ఒక కుటుంబం ఉందని భార్యాపిల్లలు తాను లేకపోతే ఎలా బ్రతుకుతారో అన్న విషయాలను కూడా ఆలోచించకుండా ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చివరికి కుటుంబాన్ని అరణ్య రోదనలోకి నెట్టాడు అని చెప్పాలి. ఇక ఈ విషాదకర ఘటన సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం లో వెలుగులోకి వచ్చింది.


 గుమ్మడిదల గ్రామానికి చెందిన మసిరెడ్డిపల్లి నవీన్ రెండేళ్ల క్రితం లావణ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇటీవలే ఏం జరిగిందో తెలియదు. కానీ ఇంటి నుంచి బయటకు వస్తాను అంటూ చెప్పి వెళ్లిపోయాడు. మళ్ళీ ఎంతకీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అనుమానం వచ్చిన భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాలలో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే స్థానికులు ఒకచోట నవీన్ చెట్టుకు ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి ఇక ఈ కేసును మరింత ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: