
దాంపత్య బంధంలో ఎలాంటి సమస్య వచ్చిన సర్దుకుపోయి బ్రతకాలి అనుకోవట్లేదు ఎవరు కూడా. చిన్న చిన్న విషయాలకే ఈగోలకు పోయి చివరికి దారుణంగా ప్రవర్తిస్తున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. భార్యాభర్తలు అంటే ఒకరికి ఒకరు ప్రాణంగా బ్రతకడం కాదు ఒకరి ప్రాణాలు ఒకరు తీయడానికి కూడా సిద్ధమవుతున్న పరిస్థితి నేటి రోజుల్లో కనిపిస్తుంది. అయితే ఇలాంటి రోజుల్లో కూడా ఇంకా ఒకరంటే ఒకరికి ప్రాణంగా బ్రతికే భార్యాభర్తలు ఉన్నారు అన్న విషయం నిరూపించేలా కొన్ని ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి అని చెప్పాలి.
ఇక ఇప్పుడు వెలుగు లోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినది అని చెప్పాలి. జీవితాంతం ఒకరికి ఒకరు తోడునీడగా నిలిచిన భార్యాభర్తలు అటు చావులోనూ ఒకరికి ఒకరు తోడుగానే ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకేరోజు మృతి చెందిన విషాదకర ఘటన నెల్లూరు జిల్లాలోని నరుకూరు గ్రామంలో వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్ళ రమణ, 36 ఏళ్ల సుమలత అన్యోన్య దంపతులుగా ఉన్నారు. గత కొంతకాలంగా వీరిద్దరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. రమణ తో పాటు సుమలతను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే ఇటీవల రమణ మృతి చెందగా అతని అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటలకే సుమలత కూడా ప్రాణాలు విడిచింది.