కావాల్సిన ప‌దార్థాలు: 
సమోసాలు- ఐదు
సెనగలు- ఒక కప్పు
టొమాటో ముక్కులు- అక క‌ప్పు
అల్లంవెల్లుల్లిపేస్ట్‌- ఒక‌టిన్న‌ర స్పూన్‌

 

ఉల్లిపాయలు- రెండు
వాము- అర టీస్పూన్‌
పచ్చిమిర్చి- రెండు
ఉప్పు- రుచిక స‌రిప‌డా
అల్లం చట్నీ- చిన్న కప్పు

 

కారపూస- అర క‌ప్పు
పసుపు- చిటికెడు
కారం- ఒక‌ టీస్పూన్‌
చాట్‌మసాలా- ఒక టీ స్పూన్‌
కొత్తిమీర-  కొద్దిగా

 

నిమ్మరసం- ఒక టీ స్పూన్‌
ధనియాల పొడి- ఒక టీస్పూన్‌
గరంమసాలా- అర‌ టీస్పూన్‌
ఆంచూర్ పొడి- అర‌ టీస్పూన్‌

 

త‌యారీ విధానం: ముందు  రోజు రాత్రి సెనగలను నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీళ్లు తీసేసి సెనగలు పక్కన పెట్టాలి. తర్వాత ఒక పాత్రలో వాము, ఉల్లిపాయలు, టొమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ధనియాల పొడి వేసి కలియబెట్టాలి. మిశ్రమాన్ని కుక్కర్‌లో వేసి దోరగా వేగిన తర్వాత సెనగలు, ఉప్పు, నీళ్లు పోసి చిన్న మంటపై ఉడికించాలి. 

 

ఆవిరి పోయిన తరువాత గరంమసాలా, ఆంచూర్ పొడి వేసి కలపాలి. మిశ్రమం చిక్కగా అయ్యే వరకు చిన్న మంటపై ఉడికించాలి. మ‌రోవైపు ప్లేట్‌లో సమోసా తీసుకుని కొద్దిగా చిదిమి వేడి వేడి మసాలాను లేయర్‌గా వేసుకోవాలి. ఇప్పుడు అల్లం చట్నీ, తరిగిన ఉల్లిపాయలు, కార‌పూస‌ వేసుకోవాలి. త‌ర్వాత చాట్‌ మసాలా చల్లి, కొత్తిమీరతో గార్నిష్ చేసి.. చివరగా నిమ్మరసం పిండితే స‌రిపోతుంది. అంటే టేస్టీ టేస్టీ సమోసా చాట్ రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: