కావాల్సిన ప‌దార్థాలు:
మామిడికాయ ముక్కలు- కేజీ
నువ్వుల నూనె- పావు క‌ప్పు
జీలకర్ర పొడి- రెండు టేబుల్ స్పూన్లు

 

ధనియాల పొడి- రెండు టేబుల్ స్పూన్లు
గరం మసాల పొడి-  ఒక టేబుల్ ‌స్పూన్ 
మెంతిపొడి- ఒక‌ టీస్పూన్ 
కారం- ఐదు టేబుల్ స్పూన్లు

 

పసుపు- ఒక టేబుల్ స్పూన్ 
అల్లం పేస్ట్‌- 125 గ్రాములు
వెల్లుల్లి పేస్ట్‌- 100 గ్రాములు
ఎండుమిర్చి- ఐదు

 

మెంతులు- ఒక‌ టీస్పూన్‌
ఉప్పు- పావు కిలో
ఇంగువ- చిటికెడు
జీలకర్ర- ఒక టీస్పూన్‌

 

త‌యారీ విధానం:
ముందుగా మామిడికాయ ముక్కలు శుభ్రంగా క‌డిగి.. తుడిచి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర పొడి, మెంతిపొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి వేసి, ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసి కలపాలి. 

 

మరో గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఇంగువ వేయాలి. ఇందులో జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి వేసి కాస్త ఎర్రబడ్డాక దింపేయాలి. కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు అల్లం, వెల్లులి పేస్టులు వేసి కలపాలి. చల్లబడిన తర్వాత మామిడికాయ ముక్కలు, మసాలా పొడులు వేసి కలియబెట్టాలి. ఇక ఇందులోనే కావాల‌నుకుంటే కొన్ని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, సాజీర కూడా వేసి మొత్తం బాగా కలిసాక శుభ్రమైన జాడీలోకి ఎత్తిపెట్టుకోవాలి. 

 

అంటే ఎంతో రుచిక‌ర‌మైన మసాలా ఆవకాయ రెడీ అయిన‌ట్లే. అయితే మామూలు ఆవకాయ కంటే ఇది కాస్త ఘాటుగా ఉంటుంది. కానీ, వేడి వేడి రైస్‌తో దీని కాంబినేష‌న్ అదిరిపోతుంది. ఇక ఇది ఎలాగో ప‌చ్చ‌ళ్ల సీజ‌నే కాబ‌ట్టి.. మామిడి కాయ‌లు కూడా ఈజీగా దొరుకుతాయి. సో.. త‌ప్ప‌కుండా మసాలా ఆవకాయ మీరు కూడా ట్రై చేసి.. ఎంజాయ్ చేయండి.
 

  

  

మరింత సమాచారం తెలుసుకోండి: