కావలసిన పదార్థాలు:
టొమాటోలు - 200 గ్రాములు,
సగ్గుబియ్యం - పావుకేజీ,
నీరు - 6 కప్పులు,
ఉప్పు - రుచికి సరిపడా,
కారం - ఒక టీ స్పూన్.
తయారీ విధానం :
ముందుగా సగ్గుబియ్యాని 15 నిమిషాలపాటు నీటిలో నానబెట్టుకోవాలి. తరువాత టొమాటోలను నీటిలో ఒక పావుగంట ఉడికించుకోవాలి. తరువాత వాటిని చల్లారనిచ్చి, తొక్క తీసి, మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యంలో నీటిని వడకట్టి, నానిన సగ్గుబియ్యాన్ని ప్రెజర్ కుక్కర్ లోకి తీసుకొని అందులోకి 6 కప్పులు నీటిని తీసుకొని 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించి దింపేసుకోవాలి. చల్లారిన తరువాత ఉప్పు, కారం, ఉడికించి మెత్తని పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో గుజ్జుని వేసి బాగా కలపాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లోకి తీసుకొని వడియాలలాగా పెట్టుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. అలా ఎండిన వాటిని నూనెలో వేసి వేయించుకుంటే టమాటో వడియాలు రెడీ.ఇవి తినడానికి చాలా బాగుంటాయి. చక్కగా పప్పుచారు పెట్టుకుని ఈ వడియాలు నంచుకుని తింటే భలే ఉంటాయి. అలాగే పిల్లలకు ఈవెనింగ్ టైములో స్నాక్స్ రూపంలో కూడా వీటిని వేయించి పెట్టవచ్చు.. !!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి