దేశంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకోస్తున్న చట్టాలు కామాంధుల చేతులకు కళ్లెం వేయలేక పోతున్నాయి..తాజాగా ఓ సినీ నటి పై ఓ పారిశ్రామిక వేత్త అత్యాచారానికి యత్నించిన ఘటన వెలుగు చూసింది.. కూల్ డ్రింక్ లో మత్తు మందు కలిపి అత్యాచారం చేశాడు..  ఆ తతంగాన్ని వీడియో తీసి బ్లాక్ మైల్ చేస్తున్నాడని వార్తలు వినపడుతున్నాయి..

 

 

వివరాల్లోకి వెళితే... కన్నడ, తమిళ సినిమాల్లో నటించిన నటిపై కార్పోరేట్ కంపెనీ సీఈవో ఒకరు అత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో వెలుగుచూసింది. తనకు ఎదురైన చేదు అనుభవంపై బాధితురాలు స్వయంగా బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. బెంగళూరులోని జేజే నగర్‌ పరిధిలో ఉంటున్న ఓ మహిళ తమిళ, కన్నడ భాషల్లోని అనేక సినిమాల్లో నటించారు. 2018లో బసవనగుడి పరిధి గాంధీ బజార్‌ ప్రాంతానికి చెందిన మోహిత్‌ అనే వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. తాను ఓ కార్పరేట్ కంపెనీకి సీఈవోగా వ్యవహరిస్తున్నానని చెప్పి ఆమెతో సన్నిహితంగా మెలిగాడు.

 


కొద్దిరోజులకు ఆమెను తన కంపెనీకి అంబాసిడర్‌గా నియమించాడు. ఈ క్రమంలోనే కంపెనీ ప్రచారం నిమిత్తం ఆమెను గోవా వంటి పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లాడు. తన కంపెనీ ఆర్థిక సమస్యలో ఉందంటూ ఆమె నుంచి అనేకసార్లు పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నాడు. 2019 జూన్‌ 22న పుట్టినరోజు పేరుతో మోహిత్ తన ఇంట్లోనే పార్టీ ఇచ్చాడు. ఆ తర్వాతి రోజే ఆమె పుట్టినరోజు కావడంతో ఇద్దరూ కలిసి ఏకాంతంగా పార్టీ చేసుకున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న మోహిత్ కూల్‌డ్రింక్‌ మత్తుమందు కలిపి ఆమెతో తాగించాడు.

 


దాంతో ఆమె మత్తులోకి జారుకుంది.. అదే అదునుగా అనుకున్న అతను ఆమెపై అత్యాచారానికి పాల్పడటంతో పాటు ఆ తతంగాన్నంతా సెల్‌ఫోన్లో వీడియో తీశాడు. వాటితో బ్లాక్‌మెయిల్ చేస్తూ పలు విడతలుగా సుమారు రూ.20లక్షల వరకు దోచుకున్నాడు. తనకు సాయం చేస్తారన్న ఆశతో ఈ విషయాన్ని బాధితురాలు నిందితుడి తల్లిదండ్రులకు చెప్పగా వారు కూడా బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు మోహిత్‌తో పాటు అతడి తల్లిదండ్రులు మహాదేవ్, నాగవేణితో పాటు బంధువు రాహుల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు మోహిత్ అతని కుటుంబ సభ్యుల కోసం గాలిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: