అయితే ముసుగులు వేసుకుని తెగ టెన్షన్ పడిపోతున్న సదరు మహిళలను చూస్తే స్థానికులకు ఎందుకో అనుమానం కలిగింది. ఏంటా అని దగ్గరికి వెళ్లి నిలదీస్తే ఊహించని నిజం బయటపడింది. దీంతో వెంటనే అప్రమత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఇక రంగ ప్రవేశం చేసిన పోలీసులు మహిళలను అరెస్టు చేశారు. ఇంతకీ ఆ మహిళలను ఎందుకు అరెస్టు చేశారు అని అంటారా.. వారు మామూలు మహిళలు కాదు కిడ్నాప్ కిలాడీలు అన్న విషయం తెలియడంతో స్థానికులు కంగుతిన్నారు. ఈ షాకింగ్ ఘటన నిజాంబాద్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది
నిజాంబాద్ నగరంలోని వన్టౌన్ త్రీటౌన్ పరిధిలో మాయలేడి లు ఇటీవలే బిక్షాటన చేస్తున్నట్లుగా డ్రామా ఆడారూ. ఈ క్రమంలోనే ఇంట్లో ఒక ముసలావిడ తో పాటు ఇక ఆమె మనవడు కూడా ఉన్నట్లు గుర్తించి ఆ బాలుడిని అపహరించేందుకు ప్రయత్నించారు. ఇక ఇది గమనించిన పొరుగింటి వారు ఆ మహిళలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా వారిని పక్కకు నెట్టి మరి అక్కడి నుంచి పరారయ్యారు ఇక రోడ్డుమీదికి చేరుకొని ఎక్కడికి వెళ్లాలో తెలియక అటూ ఇటూ ఎంతో కంగారుగా తిరుగుతున్నారు అయితే అనుమానాస్పదంగా కనిపిస్తున్న సదరు మహిళలను గమనించిన స్థానికులు వెళ్లి విషయం ఏంటి అని నిలదీయగా వారిపై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించారు దీంతో ఇక పిల్లలను కిడ్నాప్ చేసి ఉంటారని భావించిన వారు పోలీసులకు సమాచారం అందించడంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి