చిన్నప్పుడు బన్నీ చాలా డల్ గా, సైలెంట్ గా ఉండేవాడట. అసలు అల్లరి అనే మాటే తెలియదట. పరీక్షల ముందు గంటల తరబడి చదువుతూనే ఉండేవాడట, కానీ అమ్మ ప్రశ్నలు అడిగితే మాత్రం మైండ్ అంతా ‘బ్లాంక్’ అయిపోయేదట. అంత చదివినా చివరికి రిజల్ట్ మాత్రం ఫెయిల్ అని వచ్చేదని, ఆ సమయంలో బన్నీ పడ్డ ఇబ్బందులు ఇప్పుడు తలచుకుంటే ఆశ్చర్యంగా ఉందని శిరీష్ చెప్పుకొచ్చారు.చదువులో వెనుకబడితే జీవితం ఆగిపోతుందని భావించే నేటి తరానికి అల్లు అర్జున్ ఒక గొప్ప ఉదాహరణ.ర్యాంకులు రానంత మాత్రాన కెరీర్ ముగిసినట్లు కాదు. తనలోని టాలెంట్‌ను గుర్తించి, డ్యాన్స్, యాక్టింగ్, స్టైల్ పై ఫోకస్ పెట్టిన బన్నీ.. నేడు గ్లోబల్ ఐకాన్ గా ఎదిగారు. ‘పుష్ప’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, మొదటిసారి టాలీవుడ్‌కు ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును తెచ్చిపెట్టిన ఘనత ఆయనకే దక్కింది.
ప్రస్తుతం బన్నీ క్రేజ్ మామూలుగా లేదు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అట్లీ కుమార్‌తో కలిసి అల్లు అర్జున్ చేయబోతున్న ‘రాకా’ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.కమర్షియల్ ఎలిమెంట్స్‌కు ఎమోషన్ జత చేయడంలో అట్లీ దిట్ట. బన్నీని ఇప్పటివరకు ఎవరూ చూడని ఒక డిఫరెంట్ అండ్ మాస్ లుక్‌లో అట్లీ ప్రెజెంట్ చేయబోతున్నారట.ఈ సినిమాను కేవలం పాన్ ఇండియా లెవల్లోనే కాదు, గ్లోబల్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ కాంబో అనౌన్స్‌మెంట్ తోనే బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు మొదలయ్యాయి.జీవితంలో విజయం సాధించడానికి ఒక్కటే ఫార్ములా ఉండదు. పట్టుదల, క్రమశిక్షణ, తన మీద తనకు నమ్మకం ఉంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఎదగొచ్చని బన్నీ నిరూపించారు. చదువులో ఫెయిల్ అయిన కుర్రాడు, నేడు కోట్లాది మందికి ‘ఐకాన్’ గా మారడం వెనుక దశాబ్దాల శ్రమ ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి