ఎంతో ప్రేమగా పెంచుకున్న తమ కూతురిని, తమ కంటే బాగా చూసుకోగలరనే నమ్మకంతో ఆర్థిక స్తోమత తక్కువ ఉన్నప్పటికీ , అల్లుడికి మర్యాద తగ్గకూడదని, అప్పులు చేసి మరీ పెళ్లి చేశారు ఆ కన్న తల్లిదండ్రులు. కానీ తమ అల్లుడు మాత్రం కట్నం కోసం వేధించారు. తమ అత్తమామలు, తల్లిదండ్రులుగా చూసుకోవాల్సింది పోయి, తమ కొడుక్కి సహకారం అందిస్తూ తమ కోడలిని చిత్రహింసలకు గురి చేశారు.

ఇలా తనని కష్టపెట్టిన వారి గురించి, వారి తల్లిదండ్రులకు చెప్పుకోలేక, తమ కజిన్ తో చెప్పింది ఆ పెళ్ళికూతురు. అలా చెప్పడమే ఆమె పాలిట శాపమైంది. అలా వారి కజిన్తో మాట్లాడిన రెండో రోజుకే ఆమె శవం గా మారింది. తమ అత్తవారింట్లోనే మృతిచెందింది విస్మయ.

కొల్లం పల్లి జిల్లా పందలం గ్రామంలోని యువతి విస్మయ నాయర్ (28)  ఈమె ఆయుర్వేదం డిగ్రీ మూడవ సంవత్సరం చదువుతోంది. ఈమెలా చదువుతున్నప్పుడే అదే జిల్లాకు చెందిన శాస్త్రం కొట్టా ప్రాంతానికి చెందిన యువకుడు కిరణ్ తో మూడు నెలల కిందట వివాహమైంది. ఈ యువకుడు ఒక ప్రముఖ మోటార్ కంపెనీలో మేనేజర్ గా పని చేస్తుండడంతో.. ఇతనికి విస్మయ తల్లిదండ్రులు అధిక మొత్తంలో కట్నకానుకలు ఇచ్చారు. (టొయోటా కారు, పొలము మరియు లక్షల్లో డబ్బు ఇచ్చారు.) అలా పెళ్లి చేసుకొని అత్తవారి ఇంట్లోకి అడుగుపెట్టిన విస్మయను కిరణ్ కొద్దిరోజులు బాగానే చూసుకున్నాడు. ఇక కొద్ది రోజులు గడిచిన పిమ్మట తనలోని ఒక మానవ మృగం బయటికి వచ్చింది.
తనని చిత్రహింసలు పెట్టడమే కాకుండా, తన ఇంటికి వెళ్లి  అదనపు కట్నం తెమ్మని చిత్రహింసలు చేసేవాడు. ఇంట్లో ఏ విషయంపై చిన్న గొడవ జరిగినా, ఆమెను కొట్టేవాడు. ఇలా తన భర్త పెట్టే వేధింపులు భరించలేక తన కజిన్ తో ఇవన్నీ చెప్పుకోగా, ఫోటోలు, వీడియోలు పంపించగా ఈ విషయం తెలుసుకున్న విస్మయ తల్లిదండ్రులు, తమ అల్లుడు పై కేసు పెట్టి, తమ కూతురిని ఇంటికి పిలుచుకుని వచ్చారు.
విస్మయ తమ ఇంటికొచ్చి, రెండు నెలల తరువాత తన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్లిందని తెలుసుకున్న తన భర్త కిరణ్, కాలేజీకి వెళ్లి ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకువచ్చాడు. తన తండ్రి తన కూతురు ఇంటికి రాలేదని పోలీసులను ఆశ్రయించాడు. ఇక సోమవారం ఉదయం తమ అత్తవారి ఇంటిలో ఆమె విగతజీవిగా కనిపించింది. కానీ ఆమె భర్త కిరణ్ మాత్రం తన ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు. కానీ ఆమె తల్లిదండ్రులు మాత్రం తమ అత్తవారింటి వారే చంపారని తెలిపారు. దీంతో పోలీసులు  ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపడుతున్నారు.

ప్రస్తుతం ఉన్న సమాజంలో కూడా వరకట్న వేధింపులకు బలవుతున్న, ఎంతోమంది ఆడపిల్లల జీవితం ఇకనైనా బాగుపడాలని మనం కూడా కోరుకుందాం...


మరింత సమాచారం తెలుసుకోండి: