సినిమాల్లో ఇలాంటివి చూసినపుడు నిజ జీవితంలో ఇలాంటి చిత్రమైన ఘటనలు జరగవు అని అనుకుంటారు ప్రతి ఒక్కరు. కానీ ఇక్కడ మాత్రం ఇలాంటి తరహా ఘటన జరిగింది. ఒక భర్త ఏకంగా భార్యను త్యాగం చేసాడు. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది ఉత్తరప్రదేశ్లో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.. ఉత్తరప్రదేశ్లోని మురాదాబాద్ లోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరికి ఎన్నో ఏళ్ల కిందట పెళ్లి జరిగింది ఇక వీరి దాంపత్య జీవితం కూడా ఎంతో సాఫీగా సాగిపోతుంది. ఇక వీరి బంధానికి గుర్తుగా ఒక కూతురు కూడా పుట్టింది.
అయితే ఇటీవలే భార్య తరచు ఫోన్లో మాట్లాడుతూ ఉండడం గమనించాడు భర్త. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడగ్గా పొంతన లేని సమాధానాలు చెప్పింది భార్య. ఆ తర్వాత మరికొన్ని సార్లు ఫోన్ లో మాట్లాడుతూ ఉండటాన్ని గమనించిన భర్త గట్టిగా అడగడంతో ఇక అసలు విషయం చెప్పేసింది భార్య. పెళ్లికాకముందు ఒకరిని ప్రేమించానని అతనితోనే మాట్లాడుతున్నాను అంటూ చెప్పడంతో మొదట తీవ్ర మనస్థాపానికి గురైన భర్త ఇక ఆ తర్వాత ఆలోచించుకుని తన భార్యను ప్రియుడి దగ్గరకు పంపించాడు. ఆ తర్వాత కొన్ని సదరు మహిళ మళ్లీ భర్తకు ఫోన్ చేయడం మొదలుపెట్టింది. దీంతో ప్రియుడితో గొడవలు కాగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది వ్యవహారం. చివరికి ప్రియుడు తోనే ఉంటాను అంటూ సదరు మహిళ నిర్ణయించుకుంది. ఈ ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి