ఒకప్పుడు నాగరిక సమాజానికి దూరంగా ఉండే మనుషులు ఎలాంటి సమస్య వచ్చినా ఎంతో ధైర్యంగా ఎదుర్కొనే వారు. కానీ నేటి  రోజుల్లో నాగరికత లోకి అడుగుపెడుతూనే పిరికివాళ్లాలా మారిపోతున్నారు.. చిన్న సమస్యలకే జీవితం అయిపోయింది అంటూ భావిస్తూ ఎంతో విలువైన ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తూ ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నారు.. ముఖ్యంగా నేటి రోజుల్లో యువత అయితే క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలో రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి అని చెప్పాలి.



 పరీక్షలలో ఫెయిల్ అయ్యామని.. లేదా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని.. ప్రేయసి తో గొడవ జరిగిందని ఇలాంటి చిన్నచిన్న కారణాలకే  కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒక్క క్షణం పాటు ప్రశాంతంగా ఆలోచించకుండా క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకుంటూ జీవితాన్ని ముగిస్తున్నారు.. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. కుమారుడు సమస్యలతో సతమతం అవుతున్నాడు అని తెలిసి తండ్రి ఉదయాన్నే కొడుకును కలిసేందుకు నగరానికి చేరుకున్నాడు. కానీ తీరా వెళ్ళి చూశాక చేతికొచ్చిన కొడుకు విగతజీవిగా ఉరికి వేలాడుతూ ఉండడం చూసి ఆ తండ్రి గుండె పగిలిపోయింది. అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు ఇక లేడు అన్న విషయాన్ని జీర్ణించుకోలేక ఆ తండ్రి గుండెలు పగిలేలా ఏడ్చాడు.


 ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లా పెగడపల్లి గ్రామానికి చెందిన భరత్ కుమార్ ఇంటర్ చదువును మధ్యలో ఆపేసి రెండు నెలల కిందట ఉద్యోగం కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. ఈ క్రమంలోనే కేపీహెచ్బీ ధర్మారెడ్డి కాలనీలో ఒక గది అద్దెకు తీసుకొని ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టడంతో ఇటీవల సతమతమై పోయాడు.. ఇటీవలే రాత్రి సమయంలో తండ్రికి ఫోన్ చేసి చాలా సమస్యలు ఉన్నాయి అంటూ చెప్పాడు. ఈ క్రమంలోనే కొడుకు సమస్యలు ఉన్నాయని తండ్రి ఉదయాన్నే బయలుదేరి నగరానికి వచ్చాడు. ఇక కొడుకు కు ఫోన్ చేయగా ఎలాంటి స్పందన లేదు. పోలీసుల సాయంతో ఇక కుమారుడు ఫోన్ నెంబర్ లొకేషన్ ఆధారంగా గదికి చేరుకుని తలుపు తెరచి చూసే సరికి భరత్ కుమార్ ఉరికి వేలాడుతూ ఉన్నాడు. దీంతో ఆ తండ్రి ఒక్కసారిగా కుప్పకూలిపోయి బోరున విలపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: