ఒకప్పుడు పెళ్ళి అంటే సాంప్రదాయబద్ధంగా జరిగేది. ముందుగా పెళ్లి కొడుకు బంధువులు పెళ్లి కూతురు ఇంటికి వెళ్లి వధువును చూడటం ఆ తర్వాత పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు  పెళ్లి కొడుకు ఇంటికి వెళ్లి కలిసి రావడం చేసేవారు. ఇదంతా పూర్తయిన తర్వాత అన్ని లాంచనాలు మాట్లాడుకుని పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు పెళ్లిళ్ళ లో మాత్రం ఇలాంటివి ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యంగా పెళ్లిచూపులు అనే మాట వినిపించడం లేదు నేటి రోజుల్లో. ఎందుకంటే ప్రస్తుతం టెక్నాలజీ యుగంలో మ్యాట్రిమోనీ సైట్లు పెరిగిపోయాయి. దీంతో పెల్లు చూపుల మొత్తం మ్యాట్రిమోనీ సైట్ల వేదికగానే జరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది యువతీయువకులు తమ పూర్తి చదువు, ఉద్యోగం కి సంబంధించిన వివరాలను కూడా మ్యాట్రిమోనీ సైట్ లలో ఉంచుతున్నారు. పెళ్లి చేసుకోవాలనుకునే వారు మ్యాట్రిమోనీ సైట్ లోనే పెళ్లి చూపులు చూసి ఇక నేరుగా మాట్లాడటం లాంటివి కూడా చేస్తున్నారు. దీంతో ఇటీవల కాలంలో ఎన్నో మ్యాట్రిమోనీ సైట్లు అందరికీ అందుబాటులో ఉన్నాయని చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో మ్యాట్రిమోనీ సైట్లలో కొన్ని కొన్ని మోసాలు కూడా జరుగుతూ ఉండటం గమనార్హం.


 సాధారణం గా మాట్రిమోనీ సైట్ లో తనకు కావాల్సిన అమ్మాయి ఎలా ఉండాలి అని కొంత మంది డీటెయిల్స్ పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ ఒక యువకుడు మాత్రం వింత కోరిక కోరాడు. తనకు కాబోయే భార్యకు ఉండాల్సిన లక్షణాలను మాట్రిమోని సైట్లో రాసుకొచ్చాడు. సంప్రదాయ విలువలు ఉన్న అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను అంటూ తెలిపిన సదరు వ్యక్తి.. ఆ తర్వాత బాడీ సైజు లను కూడా రాసుకొచ్చాడు. ఇలా ఇబ్బందికర రీతిలో రాసిన అతనిపై ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అతనిపై చర్యలు తీసుకుంటున్నామని సదరు మ్యాట్రిమోనీ వెబ్సైట్ నిర్వాహకులు తెలపడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: