ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద బాగా ఎక్కువై పోతోంది. ఎంతోమంది దొంగతనాలకు పాల్పడుతూ అందినకాడికి దోచుకో పోతూ ఉన్నారు. అయితే  అప్పుడైతే దొంగలు పక్కాగా ప్లాన్ ప్రకారం ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువులు నగలు నగదును కూడా ఎత్తుకు పోయేవారు.  కానీ నేటి రోజుల్లో మాత్రం వెలుగులోకి వస్తున్న కొన్ని దొంగతనాలు చిత్ర విచిత్రం గానే ఉన్నాయి అని చెప్పాలి. నగలు నగదు లాంటివి ఎన్ని ఉన్నప్పటికీ కొంత మంది అన్నిటినీ వదిలేసి తమకు కావలసిన వస్తువులను మాత్రమే దొంగలించు పోతున్నారు.


 దొంగతనాల లో కూడా తాము మంచి దొంగలం అని నిరూపించుకుంటున్నారు చాలామంది.  అయితే అప్పట్లో ఉల్లి ధరలు ఏ రేంజిలో పెరిగిపోయాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉల్లి ధరలు సెంచరీ కొట్టడంతో ఏకంగా ఉల్లి కాస్త బంగారంలా భావించారు సామాన్య ప్రజలు.. ఈ క్రమంలోనే చోరికి వచ్చిన దొంగలు అన్ని వదిలేసి ఉల్లిని దొంగతనం చేసిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇలాంటి ఘటనలు అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురి చేశాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఉల్లి ధరలు కాస్త తగ్గినప్పటికీ టమాట ధరలు మాత్రం భగ్గుమంటున్నాయి.


 సామాన్య ప్రజలకు అందనంత దూరంలో కి వెళ్లిపోయాయి టమాట ధరలు. దీంతో ప్రస్తుతం దొంగల మొదటి టార్గెట్ గా మారిపోయింది టమాటా. ఏకంగా టమాటాలు దొంగతనాలు చేయడానికి పక్కా ప్లాన్ తో వస్తున్నారు ఎంతో మంది దొంగలు.. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.. పెనుగంచిపోలు లో కూరగాయల దుకాణం లో రాత్రి దొంగలు పడ్డారు.. అయితే ఏం దొంగలించారు అని చూస్తే మిగతా అన్ని వదిలేసి కేవలం టమాటాలు మాత్రమే దొంగలించారు. దుకాణంలో ఉన్న ఏకంగా మూడు టమాటా ట్రేలు ఎత్తుకుపోయారు. ఈ క్రమంలోనే వ్యాపారి ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు టమాటా దొంగల కోసం గాలిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: