సాధారణంగా స్కూల్ ప్రిన్సిపాల్ హోదాలో కొనసాగుతున్నా వ్యక్తి ఏం చేస్తాడు. స్కూల్లో ఉపాధ్యాయులందరూ సక్రమంగా విద్యార్థులతో నడుచుకుంటూ ఉన్నారా లేదా అన్నది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటాడు. అదే విధంగా సరైన రీతిలో ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారా లేదా అన్నది కూడా చూసుకుంటూ ఉంటాడు. విద్యార్థుల చదువు ఎలా కొనసాగుతుందిఅన్నది కూడా తెలుసుకుంటూ ఉంటాడు. ఇక విద్యార్థులకు పాఠశాల లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయన్న విషయాన్ని కూడాఅడిగి తెలుసుకుంటాడు. ఇలా పాఠశాల బాధ్యత మొత్తాన్ని భుజాన వేసుకొని  ఎంతో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ మాత్రం పాఠశాల ప్రిన్సిపల్  నీచంగా ప్రవర్తించాడు.


 ఎంతో మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలవాల్సిన ఆ ప్రిన్సిపాల్ దారుణంగా వ్యవహరించాడు.ఇక కామం తో ఊగిపోయాడు. అదే స్కూల్లో చదువుతున్న విద్యార్థినులని తన సొంత బిడ్డల్లా భావించడం మానేసి ఏకంగా కీచకుడిగా మారిపోయాడు. ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు.ఈ ఘటన  హైదరాబాద్ నగరంలోని షామీర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.


 తుంకుంట మున్సిపాలిటీకి చెందిన బాలిక షామీర్పేటలోని శ్రీనివాస మెమోరియల్ హై స్కూల్ లో ప్రస్తుతం 9వ తరగతి చదువుతోంది. ప్రతి రోజూ ఎంతో చక్కగా స్కూల్ కు వెళ్లే ఆ బాలిక గత రెండు రోజుల నుంచి మాత్రం స్కూల్ కి వెళ్లడానికి భయపడి పోతుంది. తల్లిదండ్రులు ఎంత చెప్పినా స్కూల్ కి వెళ్ళను అని చెప్పేస్తోంది.. అయితే బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో కుటుంబ సభ్యులు నిలదీశారు.ఈ క్రమంలోనే అసలు విషయం బయటపెట్టింది సదరు బాలిక. ఈనెల 22వ తేదీన స్కూల్ ప్రిన్సిపాల్ నరేందర్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని.. అందుకే స్కూల్కు వెళ్లాలంటే భయంగా ఉంది అంటూ తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో బాధిత తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: