నేటి రోజుల్లో ప్రభుత్వాసుపత్రిలో కేవలం అరకొర సదుపాయాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని భావిస్తూ ఎంతో మంది ప్రజలు అటు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. అయితే ప్రైవేట్ ఆసుపత్రిలో సదుపాయాల విషయం పక్కనపెడితే అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇక కొన్ని కొన్ని ఆసుపత్రులలో సదుపాయాలు కూడా ఉండటం లేదు అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఏకంగా ఒళ్లు గగుర్పాటు గురిచేసే ఒక ఘటన జరిగింది. ఏకంగా ప్రసూతి వార్డు నుంచి మూడు రోజుల శిశువును కుక్కలు ఎత్తుకెళ్లిన ఘటన సంచలనం గా మారిపోయింది.

 కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన శిశువు. చివరికి ఈ ప్రపంచాన్ని చూడకుండానే మృత్యుఒడిలోకి వెళ్ళిపోయింది అని చెప్పాలి. ఈ ఘటన హర్యానాలోని పానిపట్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పానిపట్ లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో శబ్నం అనే నిండు గర్భిణీ ప్రసవం కోసం చేరింది. ఈ క్రమంలోనే మూడు రోజుల క్రితమే పండంటి శిశువుకు జన్మనిచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు ఎంతో సంతోష పడిపోయారు. అయితే ఇటీవలే రాత్రి సమయంలో కుటుంబ సభ్యులు అందరూ నిద్రిస్తుండగా ఆసుపత్రి లోకి ప్రవేశించిన కుక్కలు తల్లి పక్కనే నిద్రిస్తున్న మూడు రోజుల శిశువును నోటకరిచి ఎత్తుకు వెళ్లాయి.


 ఇక ఆ తర్వాత కొంతసేపటికి తల్లి లేచి చూడగా పక్కన బిడ్డ కనిపించలేదు. విషయాన్ని వెంటనే ఆసుపత్రికి యాజమాన్యానికి తెలియజేశారు. ఆపై ఆసుపత్రి సిబ్బంది శిశువు బంధువులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. అయితే హాస్పిటల్ సమీపంలోని ఓ ప్రాంతంలో కుక్క శిశువును నోటకరిచి ఉండడాన్ని గమనించి ఇక వెంటనే శిశువును ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తేల్చారు. ఆసుపత్రి నిర్లక్ష్యం కారణంగానే ఇక ఇలాంటి ఘటన జరిగిందని అటు కుటుంబ సభ్యులు బంధువులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: