టెక్నాలజీ పెరిగిపోతున్న నేటి రోజుల్లో కూడా కొంతమంది ఇంకా చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం వంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది అయితే మేమే దేవుళ్ళం అంటూ బురిడి బాబాల వేషం వేసుకుని సామాన్య ప్రజలను మోసం చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఇలా అమాయకులను టార్గెట్గా చేసుకుని మాయ మాటలతో నమ్మించి భారీగా డబ్బులు గుంజుతున్న వారి సంఖ్య  రోజు రోజుకు పెరిగిపోతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే కొంతమంది బురిడీ బాబాలు ఇలా ప్రవర్తిస్తుంటే మరికొంతమంది సామాన్య ప్రజలు పూనకం వచ్చి నప్పుడు తామే దేవుళ్ళం అంటూ అందరినీ నమ్మించడం  చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.


ఇక్కడ ఓ మహిళ కూడా ఇలాంటిదే చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. సినిమాలు చూసి ప్రభావితమైందో.. లేక ఇంకా ఏంటో తెలియదు కానీ ఏకంగా తాను మనిషిని కాదు స్వయంగా దుర్గా దేవి స్వరూపం అంటూ తనకు తానే చెప్పుకోవడం మొదలు పెట్టింది.  అంతేకాదు చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం చేసింది. మహిళలు ఇంత విచిత్రంగా ప్రవర్తించడానికి కారణం ఏకంగా జైల్ లో ఇరుక్కుపోయిన భర్తను రక్షించుకోవడానికి అన్నది మాత్రం ఆ తర్వాత అందరికీ అర్థమైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. తాగుడుకు అలవాటు పడ్డ భర్త ను ఇటీవలే పోలీసులు అదుపులోకి తీసుకొని జైల్లో పెట్టారు.


 ఇక ఈ విషయం తెలుసుకున్న ఆ మహిళ తన భర్తను రక్షించుకోవడానికి తానే దుర్గాదేవి అంటూ చెప్పుకోవడం మొదలు పెట్టింది. బీహార్లోని జమయి జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సంజు దేవి  అనే మహిళ దుర్గాదేవి అంటూ చెప్పుకోవడం మొదలు పెట్టింది. తానే దుర్గాదేవిని.. తన భర్తను కాపాడుకోవడానికి వచ్చానంటు పోలీసులతో వాగ్వివాదానికి దిగింది. అంతే కాదు పోలీస్ స్టేషన్ ముందు చేతిలో కర్ర మరో చేతిలో బియ్యం పట్టుకుని  చేతబడి చేసింది.. తన భర్తను ఎలాగైనా బయటకు తీసుకురావాలని ఉద్దేశంతోనే సదరు మహిళ విచిత్రంగా ప్రవర్తించింది పోలీసులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: