ప్రస్తుతం ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బంగళాలే దర్శనమిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.. ఇప్పటికీ కూడా అక్కడక్కడ వందల ఏళ్ల చరిత్ర కలిగిన చిన్న చిన్న పెంకుటిల్లు ఉండడం కూడా చూస్తూ ఉంటాము. అయితే ఇక కొన్ని ఇళ్లలో ఎన్నో నిధులు నిక్షిప్తమై ఉన్నాయి అని ఎంతో ప్రచారం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే అలాంటి ఇళ్లను కూల్చినప్పుడు ప్రతి ఒక్కరూ అక్కడ చేరి ఏదైనా బయట పడుతుందేమో అని ఆసక్తిగా పరీక్షించడం వంటివి చేస్తూ ఉంటారు. ఇక అందరూ ఊహించినట్లుగానే కొన్ని కొన్ని సార్లు పురాతన ఇల్లు తవ్వుతున్న సమయంలో గుప్త నిధులు బయటపడటం లాంటివి జరుగుతూ ఉంటుంది.


 మరికొన్నిసార్లు నిధులు బయటపడక పోయినప్పటికీ అటు పురాతనమైన విగ్రహాలు బయట పడటం కూడా స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. పురాతన ఇల్లు కూలుస్తున్నా సమయంలో గోడ నుంచి పెద్ద ఐరన్ బాక్స్ బయటపడింది. దీంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు. అయితే ఆ ఐరన్ బాక్స్ ను ఎవరికీ తెలియకుండా అటు కూలీలు రహస్యంగా ఉంచారు. అయినప్పటికీ ఈ విషయం ఆ నోటా ఈ నోటా పడి చివరికి ఇంటి యజమాని కి  తెలిసిపోయింది. అంతేకాదు ఆ ఐరన్ బాక్స్ లో  ఊహించని రీతిలో గుప్త నిధులు ఉన్నాయి అంటూ ప్రచారం కూడా జరిగింది.


 విజయనగరం జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కంచర వీధిలో ఓ పురాతన ఇల్లును కూల్చేటప్పుడు గోడ నుంచి ఐరన్ బాక్స్ బయటపడింది. అయితే ముందుగా కూలీలు దీనిని యజమానికి చెప్పకుండా భద్రంగా దాచారు. ఈ విషయం ఇంటి యజమాని కి తెలిసింది. దీంతో మళ్లీ కూలీలను బెదిరించి మరి ఆ యజమానిని బ్యాక్స్ ను సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై యజమాని మాట్లాడుతూ ఐరన్ లాకర్ దొరకటం వాస్తవమే కానీ ఇప్పటివరకు తెరవలేదు అని యజమాని రామలింగం చెప్పుకొచ్చాడు. కాగా దీనిపై  పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: