ఈ రోజుల్లో అక్రమ సంబంధాలు ఎక్కువ అవుతున్నాయి..భర్తకు తెలియకుండా వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకోనే మహిళలు శారీరక సుఖం ఎంతకైనా తెగిస్తున్నారు..కొన్నిసార్లు అడ్డుగా ఉన్న భర్తను దారుణంగా చంపుతున్న ఘటనలు చూస్తూనే ఉంటాము..తాజాగా ఓ ఘటన వెలుగులోకి వచ్చింది.. ప్రియుడితో సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని మజ్జిగ నిద్ర మాత్రలు వేసి చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది..


మూడునెలల తర్వాత అసలు విషయం తెలిసి అందరూ ఖంగుతిన్నారు. భార్య భర్తల అనుబంధమంటే పది కాలాలపాటు సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. కానీ నేటి సమాజంలో అందుకు విరుద్దమైన వార్తలు రోజుకొకటి బయటకొస్తున్నాయి. కొన్నిచోట్ల భర్తల వేధింపులైతే మరికొన్నిచోట్ల భార్యలు నరకం చూపిస్తున్నారు. అక్రమ సంబంధాల ఉచ్చులో పడి బంగారంలాంటి సంసారాలను నాశనం చేసుకుంటున్నారు..ఈ ఘటన జరిగి మూడు నెలలు అయ్యాక ఇది వెలుగులోకి రావడంతో పోలీసులు సైతం షాక్ అవుతున్నారు..


సత్య వెంకటలక్ష్మీలకు 2009లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. వీరి జీవితం అంతా సాఫీగానే సాగిపోతుంది. అయితే ఈ ఏడాది జూన్ 1వ తేదిన సత్య వెంకటలక్ష్మీ తన భర్తకు నిద్రమాత్రలు కలిపిన మజ్జిగను ఇచ్చింది. ఈ ప్రభావంతో భర్త నిద్రలోనే చనిపోయాడు. తెల్లవారేసరికి తన భర్తకు గుండె పోటు వచ్చిందని నమ్మబలికింది. సుబ్బారావు తోబుట్టువులు, బంధువులు నిజమనే అనుకున్నారు..


భర్త చనిపోయిన మూడు నెలలకే సత్యవెంకటలక్ష్మీ ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చింది. ఓ వ్యక్తితో చనువుగా ఉండటాన్ని ఆమె భర్త బంధువులు గమనించారు. ఆమె ఇంటికి వచ్చే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన ఉసిరి శ్రీనివాస్‌గా గుర్తించారు. అసలు వీరిద్దరికి పరిచయం ఎలా అనేదానిపై కూపీ లాగారు. అప్పుడే కుటుంబసభ్యులు ఆరా తీయగా విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి..భర్తకు ఈ విషయం తెలిసిపోతుందన్న భయంతో ముందుగానే ప్రణాళికతో మజ్జిగలో నిద్రమాత్రలు కలిపి అతడిని పక్కాప్రణాళికతో హత్య చేసినట్లు వెంకటలక్ష్మీ పోలీసు విచారణలో నిజాలు బయటపెట్టేసింది. ఇప్పుడు ప్రియుడితో కలిసి జైల్లో ఊసలు లెక్క పెడుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: