ఇక ఇలాంటి తరహా ఘటనలు చూసినప్పుడు సభ్య సమాజం మొత్తం ఉలిక్కిపడే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. కుటుంబ కలహాలతో ఏకంగా సొంత అల్లుడుని హత్య చేశాడు మామ. కూతురు పసుపు కుంకాలను చేజేతులారా తెంపేశాడు. ఈ ఘటన సుల్తానాబాద్ లోని జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో వెలుగులోకి వచ్చింది. పులుపు ప్రశాంత్ అనే యువకుడు వరసకి మేనమామ అయ్యే వ్యక్తి కూతురు పూజితను ప్రేమించి పెద్దలను ఒప్పించి 2018లో వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కొన్నాళ్లపాటు వీరికి కాపురం సజావుగానే సాగింది. కానీ చిన్న చిన్న విషయాలకి భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి ఇక ఈ గొడవలు పెరిగి పెద్దదై కుటుంబ కలహాలుగా మారిపోయాయి.
చివరికి పూజితకు విడాకులు ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాడు ప్రశాంత్. దీంతో ప్రశాంత్ తీరుపై మేనమామ కక్ష కట్టాడు. ఈ క్రమంలోనే ఎలాగైనా అల్లుడిని హత మార్చాలి అని నిర్ణయించుకున్నాడు. ఇందుకోసం తన మేనమామ రాజమౌళి బావమరిది వెంకటస్వామి ల సహాయం తీసుకున్నాడు. కర్రలతో దారుణంగా దాడి చేసి చివరికి హత్య చేశారు. అయితే స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించిగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యం నిర్ధారించారు. ఈ ఘటన కాస్త స్థానికంగా సంచలనంగా మారగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి