ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన తర్వాత సాటి మనుషులను కూడా నమ్మే పరిస్థితి లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే మంచి వాళ్లలాగా ప్రవర్తిస్తూ ఎంతో నమ్మకంగా ఉంటున్న వారే చివరికి సమయం సందర్భం చూసుకొని అందిన కాడికి దోచుకుపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అంతేకాదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అప్రమత్తంగా లేకపోతే చివరికి నిలువు దోపిడీకి పాల్పడుతూ ఉండడం కూడా నేటి రోజుల్లో వెలుగు చూస్తుంది అని చెప్పాలి. దీంతో సాటి మనిషి మరో మనిషిని నమ్మలేని పరిస్థితి నేటి సభ్య సమాజంలో నెలకొంది అని చెప్పాలి.


 ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన గురించి తెలిసిన తర్వాత ఇక మనుషులపై ఉన్న నమ్మకం పూర్తిగా నశించిపోతుంది అని చెప్పాలి. ఏకంగా మార్కెట్లోకి వెళ్లిన వ్యక్తి దగ్గర నుంచి చరవాణిని దొంగలించిన ఒక నిందితుడు ఆ మొబైల్ ఆధారంగా అకౌంట్లో ఉన్న లక్షల రూపాయలను డ్రా చేసుకున్నాడు. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా తీమ్మాజీపేట మండలంలో వెలుగు చూసింది అని చెప్పాలి. నేరేళ్లపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపి సాయిబాబా ఇటీవల  మెహబూబ్ నగర్ లోని మార్కెట్లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లాడు.


 ఇక అదే మార్కెట్లో ఎవరి జేబులోంచి డబ్బులు కొట్టేయాలా అని ఎదురుచూస్తున్న ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇక ఆర్ఎంపీ సాయిబాబా జేబులో ఉన్న సెల్ ఫోన్లు కొట్టేశారు. కాసేపటికి తన జేబులో సెల్ఫోన్ లేదు అన్న విషయాన్ని అర్థం చేసుకున్న సాయిబాబా చుట్టుపక్కల వెతికిన ఫలితం లేకుండా పోయింది. దీంతో అదే నెంబర్ తో కొత్త సిమ్ కార్డు తీసుకున్నాడు. ఇక తర్వాత బ్యాంకు ఖాతాను బ్లాక్ చేసేందుకు బ్యాంకుకు వెళ్ళాడు. కానీ నాలుగు విడతల్లో ఏకంగా లక్ష రూపాయల వరకు అతని బ్యాంకు ఖాతా నుంచి వేరే బ్యాంకు ఖాతాకి బదిలీ అయినట్లు గుర్తించాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: