నేటి రోజుల్లో మనిషి లో విచక్షణ జ్ఞానం అనేది పూర్తిగా కనుమరుగై పోతుంది అన్నది ఎవరో చెప్పడం కాదు నేటి రోజుల్లో వెలుగు లోకి వస్తున్న ఘటనలే చెప్పకునే చెబుతూ ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో నైనా సరే విచక్షణగా ప్రవర్తిస్తూ బంధాలకు బంధుత్వాలకు విలువ ఇచ్చిన మనిషి.. ఇక ఇప్పుడు అదే విచక్షణ కోల్పోయి సొంత వారిని దారుణం గా హత్య చేస్తున్న ఘటనలు కూడా వెలుగు లోకి వస్తున్నాయి. అది కూడా చిన్నచిన్న కారణాలకే దారుణం గా ప్రాణాలను తీస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 కొన్ని ఘటనల్లో ఏకంగా అల్లారు ముద్దుగా చూసుకోవాల్సిన తల్లి దండ్రులు కడుపున పుట్టిన పిల్లలను దారుణం గా హతమారుస్తూ ఉంటే మరికొన్ని ఘటనల్లో పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పాలిట పిల్లలు యమకింకరులుగా మారిపోతున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. ఏకంగా సొంత వారిపైనే కక్ష పెంచుకొని దారుణంగా ప్రాణాలు తీసేస్తూ ఉన్నారు. ఇక్కడ మధ్యప్రదేశ్లో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. బైక్ ఇవ్వలేదు అన్న చిన్న కారణంతో తండ్రిని చంపబోయాడు  కొడుకు.



 స్నేహితుల తో బయటకు వెళ్తున్నా బైక్ ఇవ్వమంటూ తండ్రిని అడిగాడు కొడుకు. అయితే తండ్రి మాత్రం బైక్ ఇవ్వలేదు. దీంతో కోపంతో ఏకంగా తండ్రిపై పెట్రోల్ పోసిని నిప్పు అంటించాడు. మధ్యప్రదేశ్ కు చెందిన శాంకి అనే వ్యక్తి పని మీద బయటకు వెళ్లేందుకు.. బైక్ తాళం ఇవ్వమనగా తండ్రి సునీల్ బైక్ ఇచ్చేందుకు నిరాకరించాడు. దీంతో కోపోద్రిక్తుడైన శాంకి తండ్రి పై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడ నుంచి పారిపోయాడు. బంధువులు వెంటనే మంటలను ఆర్పి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సునీల్ ను  ఆసుపత్రికి తరలించారు .. ప్రస్తుతం సునీల్ కి తీవ్ర గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: