
ఈ ఘటన బీహార్ లోని గోపాల్గంజ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఈ పెళ్లి చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం చర్చనీయాంశంగా మారిపోయింది. ఇలా అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడి పేరు రాహుల్ కుమార్. హాజీపూర్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. అయితే బాధిత యువతీ ఉత్తరప్రదేశ్ కు చెందిన అమ్మాయి కావడం గమనార్హం. వీరిద్దరూ మంచి స్నేహితులు. స్నేహం ప్రేమగా కూడా మారిపోయింది. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఓ రోజు రాహుల్ కుమార్ యువతి తో కలిసి స్నేహితుని ఇంటికి వెళ్లారు. ఆరోజు జరిగిన ఘటనతో యువతి ఆరోగ్యం క్షేనించింది. అత్యాచారం జరిగినట్లు వైద్యులు తెలిపారు. వెంటనే యువతి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇక రాహుల్ కుమార్ను అరెస్టు చేసి జైలుకు పంపించారు పోలీసులు.
అయితే తాను అత్యాచారం చేయలేదని తామిద్దరం ప్రేమించుకుంటున్నాము అంటూ కోర్టు విచారణలో తెలిపాడు నిందితుడు. దీంతో ఆమెను వివాహం చేసుకున్నందుకు అనుమతి కోరాడు. ఇక కోర్టు అనుమతితో పెరోల్ పై వచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ జైలుకు వెళ్లిపోయాడు అని చెప్పాలి. అయితే ఈ కేసు విచారణ ఇంకా కోర్టులో కొనసాగుతుంది. ఈ ఘటన కాస్త స్థానికంగా చర్చ నియాంశంగా మారిపోతుంది అని చెప్పాలి.