ప్రస్తుతం సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రపంచ నలమూలల్లో ఎక్కడ ఏం జరిగినా కూడా కేవలం నిమిషాల వ్యవధిలోనే తెలుసుకోగలుగుతున్నారు అందరూ. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు అయితే ప్రతి ఒక్కరిని కూడా ముక్కున వేలేసుకునేల చేస్తూ ఉంటాయ్. డబ్బు కోసం మనుషులు ఇలాంటి పనులు కూడా చేస్తారా.. అని కొన్ని కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ప్రస్తుతం మన దేశంలో వృద్ధులకు వితంతువులకు అంగవైకల్యం కలిగిన వారు ప్రభుత్వం నుంచి ప్రతినెల పెన్షన్ పొందుతూ ఉండడం చూస్తూ ఉంటాం.



 ఇక కొంతమంది వృద్ధులు అయితే ఇలా ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ మీదే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు ఇక ప్రజలకు ఎంతగానో మేలు కలిగే విధంగా పెన్షన్ అమాంతం పెంచేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే కొంతమంది మాత్రం ఏకంగా ఇలా ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్లు పొందెందుకు ఇక చిత్ర విచిత్రంగా ఆలోచనలు చేస్తూ ఉండడం మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.



 ప్రభుత్వం నుంచి వచ్చే పింఛన్ కోసం ఆశపడిన ఒక మహిళ ఏకంగా 15 ఏళ్ళుగా అందురాలిగా నటించింది అని చెప్పాలి. 48 ఏళ్ల మహిళ 15 ఏళ్ల క్రితం అందురాలిని అంటూ డాక్టర్ నుంచి సర్టిఫికెట్ పొందింది. ఇక పింఛన్ కోసం అప్లికేషన్ కూడా పెట్టుకుంది. అయితే అధికారులు ఆమెకు పెన్షన్ మంజూరు కూడా చేశారు. ఇలా 15 ఏళ్లలో 2.08 లక్షల యూరోలు అంటే భారత కరెన్సీలో 1.8 కోట్ల రూపాయలు పెన్షన్ గా పొందింది సదరూ మహిళ. అయితే ఓ రోజు ఆమె సెల్ఫోన్ స్క్రోల్ చేస్తూ ఫైల్ పై సంతకం పెడుతూ కనిపించడంతో అధికారులు ఒక ఆమెను పట్టుకుని విచారించగా... అసలు నిజం బయటపడింది. ఇలా 15 ఏళ్లుగా ఆమె అందురాలుగా నటించిన విషయం తెలిసి పోలీసులు సైతం షాక్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: