
ఇక ఇలాంటి ఘటనల గురించి తెలిసిన తర్వాత సభ్య సమాజంలో బ్రతుకుతున్న మనుషుల కంటే అటు అడవుల్లో ఉండే క్రూర మృగాలే చాలా బెటర్ అనే భావన కూడా ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది. ఇక ప్రపంచ దేశాలకు పెద్దన్నగా ఉన్న అమెరికాలో వెలుగులోకి వచ్చిన ఒక ఘటన గురించి తెలిసి ప్రతి ఒక్కరు కూడా నివ్వెర పోతున్నారు. ఏకంగా చనిపోయిన శవాలను కూడా వదలకుండా మార్చురీలో పనిచేసే ఒక మహిళా మరో వ్యక్తితో కలిసి దారుణానికి ఒడికట్టింది అని చెప్పాలి. ఏకంగా చనిపోయిన శవాల నుంచి అవయవాలను వేరు చేసి అమ్ముకోవడం మొదలుపెట్టింది.
ఏకంగా మార్చురీలో ఉన్న మృతుల గుండె మెదడు కళ్ళతో పాటు జననేంద్రియాలు అమ్మేస్తూ ఉండేది మార్చరీలో పనిచేసే మహిళ. అయితే ఆమెకు మరో వ్యక్తి కూడా సహాయం చేసేవాడు అని చెప్పాలి. ఇక గత కొంతకాలం నుంచి ఇది జరుగుతూ ఉండడంతో ఇటీవల అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది ఆమెపై ఫిర్యాదు చేయగా అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు. అయితే దాదాపు 9 నెలల నుంచి కూడా ఇలా మృతుల అవయవాలను అమ్ముతున్నట్లు పోలీస్ విచారణలో సదరు మహిళ ఒప్పుకుంది. అయితే ఇలా చనిపోయిన వారి అవయవాలను కొనుగోలు చేసిన వ్యక్తులు వాటిని ఏం చేశారో అనే కోణంలో కూడా దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు.