
ఇలా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొని చివరికి పంటను కాపాడుకుంటూ ఉంటాడు రైతు. అయితే ఇటీవల కాలంలో ఇలా కోతుల బెడద నుంచి పక్షుల బెడద నుంచి పంటను రక్షించుకునేందుకు రైతులకు కూడా వినూత్నమైన ఆలోచన చేస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే రైతులు చేసే వినూత్నమైన ఆలోచనలు అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి. ఇక్కడ కొంతమంది రైతులు ఏకంగా పంటను కాపాడుకునేందుకు ఎలుగుబంటిగా మారిపోతున్నారు. యూపీ కి చెందిన రైతులు ఇలా వినూత్నమైన ఆలోచన చేశారు. కోతుల నుంచి తమ చెరుకు పంటను కాపాడుకునేందుకు వినూత్న ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఎలుగుబంటి వేషం వేసుకొని చెరుకు తోటలో తిరుగుతున్నారు రైతులు. ఇక పంట పై దాడి చేయడానికి కోతుల గుంపులు వస్తున్నాయని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు అంటూ రైతులు వాపోతున్నారు. దీంతో నాలుగు వేల రూపాయలు పెట్టి ఎలుగుబంటి డ్రెస్ కొనుగోలు చేశామని.. ఇక ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకొని పంట పొలంలో తిరగడం వల్ల కోతులను తరిమికొట్టగలుగుతున్నామని చెబుతున్నారు రైతులు. ఇక ఈ వినూత్నమైన ఆలోచన వల్ల తమ కష్టాలు తీరాయని.. కోతులు నిజమైన ఎలుగుబంటి అనుకుని పంట పొలాల్లోకి రావడానికి ధైర్యం చేయడం లేదు అంటూ చెబుతున్నారు.