పెళ్లి చేసుకున్న తర్వాత యువతి యువకులిద్దరు కూడా మొదటి రాత్రి విషయంలో కాస్త ఉత్సాహంగానే ఉంటారు అన్న విషయం తెలిసిందే. మొదట రాత్రి విషయంలో ఎన్నో కలలు కంటూ ఉంటారు. ఇక్కడ ఒక 35 ఏళ్ల వ్యక్తి కూడా ఇక శోభనం రాత్రి గురించి ఎన్నో కలలు కన్నాడు. అతనికి అప్పటికే 35 ఏళ్లు రాగా.. ఎన్ని సంబంధాలు చూసిన సెట్ కాలేదు. దీంతో ఇంకా పెళ్లి కావట్లేదని ఒక మ్యారేజ్ బ్రోకర్ దగ్గర అతని గోడును వెళ్ళబోసుకున్నాడు. అయితే అతను ఒక సంబంధం తీసుకురాగా.. ఇక అమ్మాయి కూడా ఇతనికి నచ్చింది. దీంతో ఒంటరితనానికి ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు.


 పెళ్లి జరిగింది. ఇక అతను శోభనం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసాడు. కానీ శోభనాన్ని వధువు వాయిదా వేస్తూ వచ్చింది. కొన్నాళ్లపాటు ఓపికగా భరించిన వరుడు ఆ తర్వాత గట్టిగా నిలదీయడంతో షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది. అది విన్న తర్వాత అతని జీవితం ఒక్కసారిగా తలకిందులైపోయింది. ఈ ఘటన రాజస్థాన్లో వెలుగులోకి వచ్చింది. జైపూర్ నగరానికి సమీపంలోని మోహన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటే లాల్ ఉంటున్నాడు. ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.



 ఈ క్రమంలోనే 35 ఏళ్ల వయసు వచ్చిన అతనికి ఇంకా పెళ్లి కాలేదు. ఇటీవలే ఒక మ్యారేజ్ బ్రోకర్ సంబంధం తీసుకురాగా ఏకంగా వధువు కుటుంబానికి నాలుగు లక్షలు ఇచ్చి మరీ చోటే లాల్  పెళ్లి ఘనంగా చేసుకున్నాడు. అయితే వధువు మంజూ మాత్రం శోభనాన్ని వాయిదా వేస్తూ వచ్చేది. ఉపవాసాలు,, వ్రతాలు అంటూ వింతైన సాకులు చెబుతుండేది.. అయితే మంజు తీరుపై చోటేలాల్ అనుమానం వ్యక్తం చేస్తూ.. ఒకరోజు గట్టిగా నిలదీశాడు. దీంతో పెళ్లికూతురు అసలు విషయం బయట పట్టింది. తనకు అంతకుముందే పెళ్లయిందని చెప్పింది. దీంతో చోటే లాల్ కు నోట మాట రాలేదు. ఇక ఇద్దరు మధ్య గొడవ జరగ్గా.. వరకట్న వేధింపుల కేసు పెడతానంటూ బెదిరించింది.. అదనంగా కొంత డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో చోటేలాల్ పోలీసులు ఆశ్రయించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: