
అయితే ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన ఘటనలు చూస్తూ ఉంటే మాత్రం భార్యాభర్తల మధ్య సర్దుకుపోయే గుణం ఎక్కడ ఉండడం లేదు. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళకే ఈగోలకు పోయి చివరికి విడాకులు తీసుకునేంతవరకు కూడా వెళ్తూ ఉన్నారు అని చెప్పాలి. కొంతమంది అయితే విడాకులు తీసుకోవడం కాదు.. కట్టుకున్న వారిని దారుణంగా హత్య చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఇలాంటి ఘటనలు చూసి.. పెళ్లి చేసుకుంటే ఇంతటి దారిన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందా అని యువతి యువకులు భయపడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే అని చెప్పాలి.
అతను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి. ఇక 2017లో ఇతనికి వివాహం జరిగింది. కొన్నాళ్లపాటు దాంపత్య జీవితం సాఫీగానే గడిచింది. కానీ ఆ తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో సర్దుకుపోవాల్సింది పోయి ఈగోలకి పోయారు. ఇక చివరికి వేరు పడాలి అని నిర్ణయించుకున్నారు. భార్య విడాకులు తీసుకొని వేరుపడింది. దీంతో మనస్థాపం చెందిన సదరు సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని బల్కంపేటలో జరిగింది. రమేష్ కుమార్ అనే 38 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగి.. 2017లో వివాహం చేసుకున్నాడు. అయితే తర్వాత మనస్పర్ధలతో 2021 లో భారీ విడాకులు తీసుకున్నప్పటి నుంచి రమేష్ మానసికంగా కుంగిపోయాడు. చివరికి తీవ్ర ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.