ఇటీవల కాలంలో సోషల్ మీడియా ఎన్నో వింతలు విశేషాలకు చిరునామాగా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంటర్నెట్లో ప్రత్యక్షమయ్యే ఎన్నో విషయాలను చూసి ఆశ్చర్యపోతున్నారు నేటిజన్స్. దీంతో ఇక గంటల తరబడి సోషల్ మీడియాలో కాలం గడపడానికి తెగ ఆసక్తి చూపిస్తూ ఉన్నారు అని చెప్పాలి. దీంతో ప్రతిరోజు కూడా ఎన్నో రకాల వీడియోలు అటు ఇంటర్నెట్లో వెలుగులోకి  వస్తున్న నేటిజన్స్ అందరిని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. కొన్ని నవ్విస్తే ఇంకొన్ని వీడియోలు భయపెడుతూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి ట్విట్టర్  వేదికగా వైరల్ గా మారిపోయింది. ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా దొంగల బెడద పెరిగిపోయింది. దీంతో ఏది కనపడితే అది దోచుకుపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంటి బయట నిలిపి ఉంచిన వాహనాలను సైతం దొంగలిస్తున్నారు అని చెప్పాలి. ఇక్కడ ఒక దొంగ కూడా ఇలాగే ఒక ట్రాక్టర్ ను దొంగలించాలి అనుకున్నాడు. ఈ క్రమంలోనే ముందుగా ట్రాక్టర్ దగ్గరికి వెళ్లి దానిని స్టార్ట్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు కదిలింది. దీంతో దొంగ ట్రాక్టర్ 2 టైర్ల మధ్య ఇరుక్కుపోయాడు.


 ట్రాక్టర్ ఇంజన్ కు వెనకాల ఉండే భారీ టైరు ఏకంగా అతని మీద నుంచి వెళ్ళిపోయింది. అయితే ఇలా వెళ్తే ఎవరైనా సరే ప్రాణాలు కోల్పోతారు. కానీ ఆ దొంగకు ఏమీ కాలేదు. వెంటనే లేచి నడుచుకుంటూ వెళ్లి మళ్లీ ట్రాక్టర్ పైన కు ఎక్కి ఇక దానిని దొంగలించుకుని వెళ్ళిపోయాడు. ఈ వీడియో చూసి నేటిజన్స్ అందరు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇతను బాహుబలి కాదు బాహుబలికే బాప్ లా ఉన్నాడు అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ ఘటన గుజరాత్ లోని ఆరవల్లిలో మోదాస నగరంలోని హాజీరా ప్రాంతంలో జరిగింది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: