పెళ్లంటే నూరేళ్లపంట అని పెద్దలు ఊరికే అనలేదు. రెండు వేరువేరు ఆలోచనలు కలిగిన... వేరువేరు స్వభావాలు కలిగిన ఇద్దరు వ్యక్తులు.. ఇక పెళ్లి అనే బంధంతో ఒక్కటవుతూ ఉంటారు. ఇలా ఒక్కటైన వారు కష్టసుఖాలను ఓర్చుకుంటూ కలకాలం కలిసి జీవిస్తూ ఉంటారు. అందుకే ఇక భారతీయ సాంప్రదాయంలో వైవాహిక బంధానికి ఎంతో ప్రత్యేకత ఉంది అని చెప్పాలి. అయితే ఒకప్పుడు పెళ్లి ఇంటికి వచ్చిన బంధుమిత్రుడు పెళ్లి జరిగిన కొన్నాళ్ళకి ఆ పెళ్లి విషయం మర్చిపోతారు. కానీ ఇటీవల సోషల్ మీడియా కారణంగా కొన్ని పెళ్లిళ్లు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతున్నాయి అని చెప్పాలి.


 పెళ్లిలలో వధూవరులు చేస్తున్న కొన్ని వింతైన పనులు ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడు గుర్తు చేసుకుని నవ్వుకునేలా చేస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా వరుడికి ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నా పెళ్లి సమయంలో మాత్రం భార్యకు ఆ విషయం తెలియకుండా దాయడానికి ప్రయత్నిస్తాడు. అయితే పెళ్లయిన కొన్నాళ్లపాటు భార్యకు ఏ విషయం తెలియకుండా జాగ్రత్త పడతాడు.


 కానీ ఇక్కడ వరుడు మాత్రం అలా చేయలేదు. అతనికి గుట్కా తినే అలవాటు ఉంది. ఏకంగా పెళ్లి పీటల మీదే అతను గుట్కా తినడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే వధువు తన పక్కన కూర్చున్న వరుడు ముఖంలో ఏదో తేడా గమనించింది. ఇక ఆ తర్వాత వరుడు గుట్క నములుతున్నాడు  అన్న విషయం వధువు అర్థం చేసుకుంది. దీంతో అతనిపై సీరియస్ అయింది.  పక్కన ఉన్న ఒక యువకుడు సర్ది  చెప్పేందుకు ప్రయత్నించగా.. అతని చెంప చెల్లుమనిపించింది. ఆ తర్వాత వరుడుని కూడా గట్టిగా కొడుతుంది. దీంతో వరుడు ఒక్కసారిగా షాక్ అయ్యి  పక్కకు వెళ్లి గుట్కా మొత్తం పక్కకు ఉమ్మేసి వస్తాడు. ఈ ఘటనతో పక్కకు ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా నవ్వుకుంటారు. ఈ వీడియో చూసి నేటిజన్స్ కూడా నవ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: